1-4. ఘనతవహించిన థెయొఫిలా, ఆరంభమునుండి కన్నులార చూచి వాక్యసేవకులైనవారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగ వ్రాయుటకు అనేకులు పూనుకొన్నారు గనుక నీకు ఉపదేశింపబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలిసికొనుటకై వాటినన్నిటిని మొదటనుండి తరచి పరిష్కారముగా తెలిసికొనియున్న నేనును నీ పేరట వాటినిగూర్చి వరుసగా రచించుట యుక్తమని యెంచితిని
5-6. యూదైయదేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగితిలోనున్ను జెకర్యా అను ఒక యాజకుడుండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతె; ఆమె పేరు ఎలీసబెతు. వీరిద్దరు ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధులచొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
7 ఎలీసబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి; మరియు వారిద్దరు బహుకాలము గడచిన (వృద్ధులైరి. )
8 జెకర్యా తన తరగతి క్రమముచొప్పున దేవుని యెదుట యాజక ధర్మము జరిగించుచుండగా
9 యాజకమర్యాదచొప్పున ప్రభువు ఆలయములోకి వెళ్లి ధూపమువేయుటకు అతనికి వంతు వచ్చెను.
10 ధూపసమయమందు ప్రజల సమూహమంతయు వెలపట ప్రార్థనచేయుచుండగా
11 ప్రభువు దూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా
12 జెకర్యా అతని చూచి తొందరపడి భయపడినవాడాయెను.
13 అప్పుడా దూత అతనితో -జెకర్యా భయపడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహను అని పేరు పెట్టుదువు.
14-16. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్బమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై, ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపుకు త్రిప్పును.
17 మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము ననుసరించుటకును త్రిప్పి, ప్రభువుకొరకు ఆయత్తపడియున్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలీయాయొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్లును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును; అతడు పుట్టినందుకు అనేకులు సంతోషింతురనెను.
18 జెకర్యా -యిదినాకేలాగు తెలియును? నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలము గడచినదని ఆ దూతతో చెప్పగ
19 దూత -నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును; నీతో మాటలాడుటకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని.
20 మరియు నా మాటలు వాటికాలమందు నెరవేరును; నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమువరకు నీవు మాటలాడలేక మౌనివై యుందువని అతనితో చెప్పెను.
21 ప్రజలు జెకర్యాకొరకు కనిపెట్టుచుండి, గర్భాలయమునందు అతడు ఆలస్యము చేసినందకు ఆశ్చర్యపడిరి.
22 అతడు వెలిపలికి వచ్చినప్పుడు వారితో మాటలాడలేకపోయినందున, గర్భాలయములో అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి; అప్పుడతడు వారికి సంజ్ఞలు చేయుచు మూగవాడై యుండెను.
23 అతడు సేవచేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన యింటికి వెళ్లెను.
24 ఆ దినములైన పిమ్మట తన భార్య ఎలీసబెతు గర్భవతియై -మనుష్యులలో నాకుండిన అవమానమును పరిహరించుటకు
25 నన్ను కటాక్షించిన దినములలో ప్రభువు ఈలాగు చేసెననుకొని అయిదు నెలలు ఇతరుల కంటబడకుండెను.
26 ఆరవ నెలలో గబ్రియేలను దేవదూత గలిలైయలోని నజరేతను ఊరిలో
27 దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవునిచేత పంపబడెను. ఆ కన్యకపేరు మరియ.
28 ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము; ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను.
29-30. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి -ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత -మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.
31 ఇదిగో నీవు గర్భముధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
32 ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
33 ఆయన యాకోబు వంశస్థులను యుగయుగముల నేలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
34 అందుకు మరియ -నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా
35 దూత -పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశివు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును.
36 మరియు నీ బంధువురాలు ఎలీసబెతుకూడ తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి యున్నది; గొడ్రాలనబడిన ఆమెకు ఇది ఆరవమాసము;
37 దేవుడు చెప్పిన యేమాటయైనను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను.
38 అందుకు మరియ -ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాటచొప్పున నాకు జరుగును గాక అనెను. అంతట దూత ఆమెయొద్దనుండి వెళ్లెను.
39 ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి
40 జెకర్యా యింటిలో ప్రవేశించి ఎలీసబెతుకు వందనముచేసెను.
41 ఎలీసబెతు మరియయొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులువేసెను. అంతట ఎలీసబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను -
42 స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడినదానవు నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును
43 నా ప్రభువు తల్లి నాయొద్దకు వచ్చుట నా కేలాగు ప్రాప్తించెను?
44 ఇదిగో నీ శుభవచనము నా చెవినిపడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను.
45 ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధంచును గనుక నమ్మిన ఆమె ధన్యురాలనెను.
46 అప్పుడు మరియ యిట్లనెను - నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది.
47 ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను
48 నా ఆత్మనా రక్షకుడైన దేవునియందు ఆనందించెను.
49 సర్వశక్తిమంతుడు నాకు గొప్పకార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్నితరములవారు నన్నుధన్యురాలని యందురు. ఆయన నామము పరిశుద్ధము
50 ఆయనకు భయపడువారిమీద ఆయన కనికరము తరతరములకుండును.
51 ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులనుచెదరగొట్టెను
52 సింహాసనములనుండి బలవంతులను పడద్రోసి దీనుల నెక్కించెను
53 ఆకలిగొనినవారిని మంచి పదార్థములతో సంతృప్తిపరచి ధనవంతులనువట్టిచేతలతో పంపివేసెను.
54-55. అబ్రాహాముకును అతని సంతానమునకును యుగాంతమువరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసికొందునని మన పితరులతో సెలవిచ్చినట్టు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలుకు సహాయము చేసెను.
56 అంతట మరియ యించుమించు మూడు నెలలు ఆమెతో కూడ ఉండి పిమ్మట తన యింటికి తిరిగివెళ్లెను.
57 ప్రసవకాలము వచ్చినప్పుడు ఎలీసబెతు కుమారుని కనెను.
58 అప్పుడు ప్రభువు ఆమెమీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులును ఆమెతోకూడ సంతోషించిరి.
59 ఎనిమిదవ దినమున వారు ఆ శిశువుకు సున్నతి చేయవచ్చి, తండ్రి పేరును బట్టి జెకర్యా అను పేరు వానికి పెట్టబోవుచుండగా
60 తల్లి -ఆలాగు వద్దు; వానికి యోహానని పేరు పెట్టవలెనని చెప్పెను.
61 అందుకు వారు -నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడును లేడే అని ఆమెతో చెప్పి
62 వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలుచేసి అడిగిరి.
63 అతడు వ్రాతపలక తెమ్మని -వాని పేరు యోహానని వ్రాసెను; అందుకు వారందరు ఆశ్చర్యపడిరి.
64 వెంటనే తననోరు తెరువబడి నాలుక సడలి, అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను.
65 అందునుబట్టి వారి చుట్టుపట్ల కాపురమున్నవారికందరికిని భయము కలిగెను. ఆ సంగతులన్నియు యూదైయ కొండసీమలయందంతట ప్రచురమాయెను.
66 ప్రభువు హస్తము అతనికి తోడైయుండెను గనుక ఆసంగతులను గూర్చి వినినవారందరును -ఈ బిడ్డ యేలాటివాడగునో అని వాటిని మసస్సులో ఉంచుకొనిరి.
67 మరియు అతని తండ్రి జెకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైయిట్లు ప్రవచించెను -
(68-75) 68 ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడుగాక
69 ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను
70 తన సేవకుడైన దావీదు వంశమునందు మనకొరకు రక్షణ శృంగమును, అనగా
71 మన శత్రువులనుండియు మనలను ద్వేషించువారందరి చేతనుండియు తప్పించి రక్షణ కలుగజేసెను.
72 దీనిగూర్చి ఆయన ఆదినుండి తన పరిశుద్ధప్రవక్తలనోట పలికించెను.
73 ఆయన మన పితరులను కరుణించుటకును
74 తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన అబ్రాహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసికొనుటకును
75 మనము శత్రువుల చేతినుండి విడిపింపబడి మనజీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధినిపరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను.
76-79. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు
మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు
ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు.
మన పాదములను సమాధాన మార్గములోకి నడిపించునట్లు చీకటిలోను మరణచ్ఛాయలోను కూర్చుండువారికి వెలుగిచ్చుటకై ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయదర్శనమనుగ్రహించెను.
80 శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.
Download Audio File

No comments:
Post a Comment