1 ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించెను.
2 సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు
3 యేసు ఎవడని చూడగోరెనుగాని, పొట్టివాడైనందున జనులు గుంపుకూడి యుండుటవలన చూడలేకపోయెను.
4 అప్పుడు యేసు ఆ త్రోవను రానైయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను
5 యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తిచూచి - జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ యింట నుండవలసియున్నదని అతనితో చెప్పగా
6 అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను.
7 అందరు అది చూచి - ఈయన పాపియైన మనుష్యునియొద్ద బసచేయ వెళ్లెనని చాల సణుగుకొనిరి.
8 జక్కయ్య నిలువబడి - ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను; నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసికొనిన పక్షమున అతనికి నాలుగంతలు మరల చెల్లింతునని ప్రభువుతో చెప్పెను.
9 అందుకు యేసు - ఇతడును అబ్రాహాము కుమారుడు గనుక నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది.
10 నశించినదానిని వెదకి రక్షించుటకు మనుష్యకుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను.
11 వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుటవలనను, దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుటవలనను, ఆయన మరియొక ఉపమానము చెప్పెను. ఏమనగా,
12 రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకొని మరల రావలెనని దూరదేశమునకు ప్రయాణమై
13 తన దాసులను పదిమందిని పిలిచి వారికి పది మినాల నిచ్చి- నేను వచ్చువరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పెను.
14 అయితే అతని పట్టణస్థులతని ద్వేషించి - ఇతడు మమ్ము నేలుట మాకిష్టములేదని అతని వెనుక రాయభారము పంపిరి.
15 అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు, ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సోమ్మిచ్చిన దాసులను తనయొద్దకు పిలువమని ఆజ్ఞాపించెను.
16 మొదటివాడాయన యెదుటికి వచ్చి - అయ్యా, నీ మినావలన పది మినాలు లభించెనని చెప్పగా
17 అతడు - భళా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక పది పట్టణములమీద అధికారివై యుండుమని వానితో చెప్పెను.
18 అంతట రెండవవాడు వచ్చి - అయ్యా, నీ మినావలన అయిదు మినాలు లభించెననగా
19 అతడు - నీవును అయిదు పట్టణములమీద ఉండుమని అతనితో చెప్పెను.
20 అంతట మరియొకడు వచ్చి - అయ్యా, యిదిగో నీ మినా;
21 నీవు పెట్టనిదాని ఎత్తుకొనువాడవును, విత్తనిదానిని కోయువాడవునైన కఠినుడవు గనుక, నీకు భయపడి దీనిని రుమాలున కట్టియుంచితినని చెప్పెను.
22 అందుకతడు - చెడ్డ దాసుడా, నీ నోటి మాటనుబట్టియే నీకు తీర్పు తీర్చుదును; నేను పెట్టనిదాని ఎత్తువాడను, విత్తనిదానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసియుండగా
23 నీ వెందుకు నా సొమ్ము సాహుకారులయొద్ద నుంచలేదు? అట్లయితే నేను వచ్చి వడ్డితో దాని తీసికొందునే అని వానితో చెప్పి
24 - వీనియొద్దనుండి ఆ మినా తీసివేసి పదిమినాలు గలవాని కియ్యుడని దగ్గర నిలిచినవారితో చెప్పెను.
25 వారు - అయ్యా, వానికి పదిమీనాలు కలవే అనిరి.
26 అందుకతడు - కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను.
27 మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టములేని నా శత్రువులను ఇక్కడికి తీసికొనివచ్చి నాయెదుట సంహరించుడని చెప్పెను.
28 యేసు ఈ మాటలు చెప్పి యెరూషలేముకు వెళ్లవలెనని ముందు సాగిపోయెను.
29 ఆయన ఒలీవలకొండదగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామముల సమీపమునకు వచ్చినప్పుడు, తన శిష్యుల నిద్దరిని పిలిచి
30 - మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్లుడి; అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడియున్న యొక గాడిదెపిల్ల మీకు కనబడును; దానిమీద ఏ మనుష్యుడును ఎన్నడును కూర్చుండలేదు; దాని విప్పి తోలుకొని రండి.
31 ఎవడైనను - మీరెందుకు దీని విప్పుచున్నారని మిమ్ము నడిగినయెడల - ఇది ప్రభువుకు కావలసియున్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపెను.
32 పంపబడినవారు వెళ్లి, ఆయన తమతో చెప్పినట్టే కనుగొని
33 ఆ గాడిదెపిల్లను విప్పుచుండగా దాని యజమానులు - మీరు గాడిదెపిల్లను ఎందుకు విప్పుచున్నారని వారినడిగిరి.
34 అందుకు వారు - ఇది ప్రభువుకు కావలసియున్నదనిరి.
35 తరువాత వారు యేసునొద్దకు దాని తోలుకొని వచ్చి, ఆ గాడిదెపిల్లమీద తమ బట్టలు వేసి, యేసును దానిమీద ఎక్కించి,
36 ఆయన వెళ్లుచుండగా తమ బట్టలు దారిపొడుగున పరచిరి.
37 ఒలీవలకొండనుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు
38 - ప్రభువు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండుగాకఅని తాము చూచిన అద్భుతములన్నిటినిగూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయసాగిరి.
39 ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులు - బోధకుడా, నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా
40 ఆయన వారిని చూచి - వీరు ఊరకుండినయెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను.
41 ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాని చూచి దాని విషయమై యేడ్చి
42 - నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనినయెడల నీకెంతో మేలు; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగుచేయబడియున్నవి.
43 (ప్రభువు) నిన్ను దర్శించినకాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టు గట్టు కట్టి ముట్టడివేసి, అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి, నీలోనున్న నీ పిల్లలతోకూడ నిన్ను నేల కలిపి
44 నీలో రాతిమీద రాయి నిలిచియుండనియ్యని దినములు వచ్చునని చెప్పెను.
45-46. తరువాత ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయువారిని చూచి- నామందిరము ప్రార్థన మందిరము అని వ్రాయబడియున్నది. అయితే మీరు దాని దొంగల గుహగా చేసితిరని చెప్పి వారిని వెళ్లగొట్ట నారంభించెను.
47 ఆయన ప్రతిదినమును దేవాలయములో బోధించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలలో ప్రధానులును ఆయనను నాశనముచేయ జూచుచుండిరి గాని
48 ప్రజలందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచలేదు.
Download Audio File

No comments:
Post a Comment