Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా9వఅధ్యాయము

1  ఆయన తన పన్నెండుమంది (శిష్యులను) పిలిచి, సమస్తమైన దయ్యములమీద శక్తిని అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికనుగ్రహించి 
2  దేవుని రాజ్యమును ప్రకటించుటకును వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుటకును వారినంపెను. 
3  మరియు ఆయన - మీరు ప్రయాణముకొరకు కర్రనైనను జాలెనైనను రొట్టెనైనను వెండినైనను మరి దేనినైనను తీసికొనిపోవద్దు; రెండు అంగీలు ఉంచుకొనవద్దు. 
4  మీరు ఏ యింట ప్రవేశింతురో ఆ యింటనే బసచేసి అక్కడ నుండి బయలుదేరుడి. 
5  మిమ్మును ఎవరు చేర్చుకొనరో ఆ పట్టణములోనుండి బయలుదేరునప్పుడు వారిమీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదధూళి దులిపివేయుడని వారితో చెప్పెను. 
6  వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు (రోగులను) స్వస్థపరచుచు గ్రామములలో సంచారముచేసిరి. 
7  చతుర్థాధిపతియైన హేరోదు జరిగిన కార్యములన్నిటిని గూర్చి విని యెటుతోచక యుండెను. ఏలయనగా కొందరు - యోహాను మృతులలోనుండి లేచెననియు, 
8  కొందరు - ఏలీయా కనబడెననియు; కొందరు - పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచుండిరి. 
9  అప్పుడు హేరోదు - నేను యోహానును తల గొట్టించితిని గదా; యెవనిగూర్చి యిట్టి సంగతులు వినుచున్నానో అతడెవడో అని చెప్పి ఆయనను చూడగోరెను. 
10  అపొస్తలులు తిరిగి వచ్చి, తాము చేసినవన్నియు ఆయనకు తెలియజేయగా ఆయన వారిని వెంటబెట్టుకొని బేత్సయిదా అను ఊరికి ఏకాంతముగా వెళ్లెను. 
11  జనసమూహములు అది తెలిసికొని ఆయనను వెబడింపగా ఆయన వారిని చేర్చుకొని, దేవుని రాజ్యమును గూర్చి వారితో మాటలాడుచు, స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచెను. 
12  ప్రొద్దు గ్రుంక నారంభించినప్పుడు పన్నెండుగురు శిష్యులు వచ్చి - మనమీఅరణ్యములో ఉన్నాము గనుక చుట్టుపట్లనున్న గ్రామములకును పల్లెలకును వెళ్లి బస చూచుకొని ఆహారము సంపాదించుకొనునట్లు జనసమూహమును పంపివేయుమని ఆయనతో చెప్పిరి. 
13  ఆయన - మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు - మనయొద్ద అయిదు రొట్టెలును రెండు చేపలును తప్ప మరేమియు లేదు; మేము వెళ్లి యీ ప్రజలందరికొరకు భోజనపదార్థములను కొని తెత్తుమా అని చెప్పిరి. 
14-15. వచ్చినవారు రమారమి అయిదువేలమంది పురుషులు. ఆయన - వారిని ఏబదేసిమంది చొప్పున పంక్తులు తీర్చి కూర్చుండబెట్టుడని తన శిష్యులతో చెప్పగా వారాలాగు చేసి అందరిని కూర్చుండబెట్టిరి. 
16  అంతట ఆయన ఆ అయిదు రొట్టెలను రెండు చేపలను ఎత్తికొని, ఆకాశమువైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి, విరిచి, జనసమూహమునకు వడ్డించుటకై శిష్యులకిచ్చెను. 
17  వారందరు తిని తృప్తిపొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపెళ్లెత్తిరి. 
18  ఒకప్పుడాయన ఎవరులేని యొక చోటన ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయనయొద్ద ఉండిరి. - నేనెవడనని జనులు చెప్పుకొనుచున్నారని ఆయన వారినడుగగా 
19  వారు బాప్తిస్మమిచ్చు యోహాననియు, కొందరు - ఏలీయాయనియు, కొందరు - పూర్వకాలపు ప్రవక్త యొకడు లేచెననియు చెప్పుకొనుచున్నారనిరి. 
20  అందుకాయన - మీరైతే నేనెవడనని చెప్పుకొనుచున్నారని వారినడుగగా పేతురు - నీవు దేవుని క్రీస్తువనెను. 
21  ఆయన - ఇది ఎవనితోను చెప్పవద్దని వారికి ఖండితముగా ఆజ్ఞాపించి, 
22  మనుష్యకుమారుడు బహు శ్రమలు పొంది, పెద్దలచేతను ప్రధానయాజకులచేతను శాస్త్రులచేతను విసర్జింపబడి, చంపబడి, మూడవ దినమున లేచుట అగత్యమని చెప్పెను. 
23  మరియు ఆయన అందరితో ఇట్లనెను –ఎవడైన నన్ను వెంబడింప గోరినయెడల తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతిదినము తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవలెను. 
24  తన ప్రాణనును రక్షించుకొనగొరువాడు దాని పొగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని రక్షించుకొనును. 
25  ఒకడు లోకమంతయు సంపాదించి తన్నుతాను పోగొట్టుకొనినయెడల, లేక నష్టపరచుకొనినయెడల వానికేమి ప్రయోజనము? 
26  నన్ను గూర్చియు నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాని గూర్చి మనుష్యకుమారుడు, తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగియున్న మహిమతో వచ్చునప్పుడు సిగ్గుపడును. 
27  ఇక్కడ నిలిచియున్నవారిలో కొందరు దేవుని రాజ్యమును చూచువరకు మరణము రుచిచూడరని నేను నిజముగా మీతో చెప్పుచున్నాననెను. 
28  ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి యెనిమిది దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థనచేయుటకు ఒక కొండయెక్కెను. 
29  ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను; ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. 
30  మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాటలాడుచుండిరి, వారు మోషే ఏలీయా అనువారు. 
31  వారు మహిమతో అగుపడి, ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమునుగూర్చి మాటలాడుచుండిరి. 
32  పేతురును అతనితోకూడ ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారుమేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతోకూడ నిలిచియున్న యిద్దరు పురుషులను చూచిరి. 
33  ఆ యిద్దరు పురుషులు ఆయనయొద్దనుండి వెళ్లిపోవుచుండగా పేతురు యేసుతో - ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది, నీకు ఒకటియు మోషేకు ఒకటియు ఏలీయాకు ఒకటియు మూడు పర్ణశాలలు మేము కట్టుదుమని, తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. 
34  అతడీలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను; వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. 
35  మరియు - ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు;ఈయన మాట వినుడని యొక శబ్దము ఆ మేఘములోనుండి వచ్చెను. 
36  ఆ శబ్దము వచ్చిన తరువాత యేసు మాత్రమే అగుపడెను. తాము చూచినవాటిలో ఒకటియు ఆ దినములలో ఎవరికిని తెలియజేయక వారు ఊరకుండిరి. 
37  మరునాడు వారు ఆ కొండ దిగి వచ్చినప్పుడు బహు జనసమూహము ఆయనకు ఎదురుగా వచ్చెను. 
38  అప్పుడు ఆ సమూహములో ఒకడు - బోధకుడా, నా కుమారుని కటాక్షించుమని నిన్ను వేడుకొనుచున్నాను, వాడు నాకొక్కడే కుమారుడు. 
39  ఇదిగో ఒక దయ్యమువాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలువేయును; నురుగు కారునట్లు అది వాని విలవిలలాడించుచు గాయపరచుచు వాని వదలి వదలకుండును. 
40  దాని వెళ్లగొట్టవలెనని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారిచేత కాలేదని మొర్రపెట్టుకొనెను. 
41  అందుకు యేసు - విశ్వాసములేని మూర్ఖతరమా, నేనెంతకాలము మీతోకూడ ఉండి మిమ్మును సహింతును? నీ కుమారుని ఇక్కడికి తీసికొని రమ్మని చెప్పెను. 
42  వాడు వచ్చుచుండగా ఆ దయ్యము వాని పడద్రోసి విలవలలాడించెను; యేసు ఆ అపవిత్రాత్మను గద్దించి బాలుని స్వస్థపరచి వాని తండ్రికప్పగించెను 
43  గనుక అందరు దేవుని మహాత్మ్యమును చూచి అశ్చర్యపడిరి. 
44  ఆయన చేసినకార్యములన్నిటిని చూచి అందరు ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఈ మాటలు మీ చెవులలో నాటనియ్యుడి. మనుష్యుకుమారుడు మనుష్యులచేతికి అప్పగింపబడబోవుచున్నాడని తన శిష్యులతో చెప్పెను. 
45  అయితే వారామాట గ్రహింపలేదు, అది వారికి మరుగచేయబడెను గనుక వారు దాని తెలిసికొనలేదు; ఆ మాటనుగూర్చి వారు ఆయనను అడుగ వెరచిరి. 
46  తమలో ఎవడు గొప్పవాడో అని వారిలో తర్కము పుట్టగా 
47  యేసు వారి హృదయాలోచన ఎరిగి, యొక చిన్నపిల్లను తీసికొని తనయొద్ద నిలువబెట్టి 
48  - ఈ చిన్నపిల్లను నా పేరట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్ను పంపినవాని చేర్చుకొనును, మీ అందరిలో ఎవడు అత్యల్పుడైయుండునో వాడే గొప్పవాడని వారితో చెప్పెను. 
49  యోహాను - ఏలినవాడా, యెవడో యొకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టగా మేము చూచితిమి వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వాని నభ్యంతరపరచితిమని చెప్పెను. 
50  అందకు యేసు - మీరు వాని నభ్యంతరపరచకుడి; మీకు విరోధి కాని వాడు మీ పక్షమున నున్నవాడే అని అతనితో చెప్పెను. 
51  ఆయన పరమునకు చేర్చుకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు 
52  ఆయన యెరూషలేముకు వెళ్లుటకు మనస్సు స్థిరపరచుకొని, తనకంటె ముందుగా దూతలను పంపెను. వారు వెళ్లి ఆయనకు బస సిద్ధముచేయవలెనని సమరైయుల యొక గ్రామములో ప్రవేశించిరి గాని 
53  ఆయన యెరూషలేముకు వెళ్ల నభిముఖుడైనందున వారాయనను చేర్చుకొనలేదు. 
 54-55. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి - ప్రభువా, 3మేము ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనముచేయ నాజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా ఆయన వారితట్టు తిరిగి వారిని గద్దించెను. 1
56  అంతట వారు మరియొక గ్రామమునకు వెళ్లిరి. 
57  వారు మార్గమున వెళ్లుచుండగా ఒకుడు - నీవెక్కడికి వెళ్లినను నీ వెంట వచ్చెదనని ఆయనతో చెప్పెను. 
58  అందుకు యేసు - నక్కలకు బొరియలును ఆకాశ పక్షులకు నివాసములును కలవు గాని మనుష్యకుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను. 
59  ఆయన మరియొకని చూచి - నా వెంటరమ్మని చెప్పగా అతడు - నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమమ్మని మనవిచేయగా 
60  ఆయన - మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. 
61  మరియొకడు - ప్రభువా, నీ వెంట వచ్చెదను గాని మా యింట నున్నవారియొద్దసెలవు తీసికొని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా 
62  యేసు - నాగటిమీద చెయ్యి పెట్టి వెనుకతట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు అర్హుడుకాడని వానితో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment