Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా21వఅధ్యాయము

1  ఆయన తమ కానుకలను కానుకపెట్టెలో వేయుచుండు ధనవంతులను పారజూచెను. 
2  ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచి 
3  - ఈ బీద విధవరాలు అందరికంటె ఎక్కువవేసెనని మీతో నిజముగా చెప్పుచున్నాను. 
4  వారందరు తమకు కలిగిన సమృద్ధిలోనుండి కానుకలు వేసిరిగాని యీమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసెనని వారితో చెప్పెను. 
5  తరువాత కొందరు - ఇది అందమైన రాళ్లతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని దేవాలయమునుగూర్చి మాటలాడుచుండగా 
6  ఆయన -ఈ కట్టడములు మీరు చూచుచున్నారే; వాటిలో రాతి మీద రాయి యుండకుండ అవి పడద్రోయబడు దినములు వచ్చుచున్నవని చెప్పెను. 
7  అప్పుడు వారు - బోధకుడా, అలాగైతే ఇవి యెప్పుడు జరుగును? ఇవి జరుగబోవునని సూచన ఏమని ఆయన నడుగగా 
8  ఆయన - మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి - నేనే ఆయననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడి పోకుడి. 
9  మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినునప్పుడు జడియకుడి; ఇవి మొదట జరగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. 
10  మరియు ఆయన వారితో ఇట్లనెను - జనముమీదికి జనమును రాజ్యమమీదికి రాజ్యమును లేచును; 
11  అక్కడ్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్లును కరవులును తటస్థించును, ఆకాశమునుండి మహాభయోత్పాతములును గొప్ప సూచకములును పుట్టును. 
12  ఇవన్నియు జరుగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పట్టి, నా నామము నిమిత్తము మిమ్మును రాజులయొద్దకును అధిపతులయొద్దకును తీసికొనిపోయి, సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. 
13  ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును. 
14  కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకొనుడి. 
15  మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. 
16  తలిదండ్రులచేతను సహోదరులచేతను బంధువులచేతను స్నేహితులచేతను మీరు అప్పగింపబడుదురు; వారు మీలో కొందరిని చంపింతురు; 
17  నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపడుదురు, 
18  గాని మీ తలవెండ్రుకలలో ఒకటైనను నశింపదు. 
19  మీరు మీ యోర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు. 
20  యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. 
21  అప్పుడు యూదైయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండు వారు వెలపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు. 
22  వ్రాయబడినవన్నియు నెరవేరుటకై అవి ప్రతి దండన దినములు. 
23  ఆ దినములలో గర్భిణలకును పాలిచ్చువారికిని శ్రమ. భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును 
24  వారు కత్తివాత కూలుదురు; చెరపట్టబడినవారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణమగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును. 
25  మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచకములును, భూమిమీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. 
26  ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకముమీదికి రాబోవుచున్న వాటివిషయమైభయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడికూలుదురు. 
27  అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూతురు. 
28  ఇవి జరుగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తికొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. 
29  మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - అంజూరపు వృక్షమును సమస్త వృక్షములనేమీ చూడుడి. 
30  అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయెనని మీ అంతట మీరు తెలిసికొందురు గదా? 
31  అటువలె మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయెనని తెలిసికొనుడి. 
32  అవన్నియు సంభవించువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 
33  భూమ్యాకాశములు గతించునుగాని నా మాటలేమాత్రమును గతింపవు. 
34  మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారమువలనను మందముగా ఉన్నందున ఆ దినములు అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. 
35  ఆ దినము భూమియందంతట నివసించు వారందరిమీదికి అకస్మాత్తుగా వచ్చును. 
36  కాబట్టి మీరు జరుగబోవు వీటినెల్లను తప్పించుకొని, మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లుఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెళుకువగా ఉండుడని చెప్పెను. 
37  ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవలకొండకు వెళ్లుచు కాలము గడుపుచుండెను. 
38  ప్రజలందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. 
Download Audio File

No comments:

Post a Comment