Not seeing a Scroll to Top Button? Go to our FAQ page for more info.

Tuesday, July 30, 2013

లూకా20వఅధ్యాయము

1  ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయములో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలతోకూడ ఆయనమీదికి వచ్చి 
2  - నీవు ఏ అధికారమువలన ఈ కార్యము చేయుచున్నావో, యీ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయనను అడిగిరి. 
3  అందుకాయన -నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. 
4  యోహాను ఇచ్చిన బాప్తిస్మము పరలోకమునుండి కలిగినదా మనుష్యులనుండి కలిగినదా? అని వారి నడుగగా 
5  వారు - మనము పరలోకమునుండి కలిగినదని చెప్పినయెడల - ఆలాగైతే మీరెందుకతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. 
6  మనుష్యులవలన కలిగినదని చెప్పినయెడల ప్రజలందరు మనలను రాళ్లతో కొట్టుదురు; ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరును రూఢిగా నమ్మచున్నారని తమలో తాము ఆలోచించుకొని 
7  అది ఎక్కడనుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరమిచ్చిరి. 
8  అందుకు యేసు - ఏ అధికారమువలన ఈ కార్యములు చేయుచున్నానో నేనును మీతో చెప్పనని వారితో ననెను. 
9  అంతట ఆయన ప్రజలతో ఈ ఉపమానము చెప్పెను - ఒక మనుష్యుడు ద్రాక్షతోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరముపోయి బహుకాలముండెను. 
10  పంటకాలమందు అతడు ఆ ద్రాక్షతోట పంటలో తనభాగమిమ్మని ఆ కాపులయొద్దకొక దాసుని పంపగా ఆ కాపులు వాని కొట్టి వట్టిచేతులతో పంపివేసిరి. 
11  మరల అతడు మరియొక దాసుని పంపగా వారు వాని కొట్టి అవమానపరచి వట్టిచేతులతో పంపివేసిరి. 
12  మరల నతడు మూడవవాని పంపగా వారు వాని గాయపరచి వెలపలికి తోసివేసిరి. 
13  అప్పుడా ద్రాక్షతోట యజమానుడు - నేనేమి చేతును? నా ప్రియకుమారుని పంపుదును; ఒకవేళ వారు అతని సన్మానించెదరనుకొనెను. 
14  అయినను ఆ కాపులు కుమారుని చూచి - ఇతడు వారసుడు; ఈ స్వాస్థ్యము మనదగునట్లు ఇతని చంపుదము రండని యొకరితో నొకరు ఆలోచించుకొని 
15  అతనిని ద్రాక్షతోట వెలపటికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ద్రాక్షతోట యజమానుడు వారికేమి చేయును? 
16  అతడు వచ్చి ఆ కాపులను సంహరించి తన ద్రాక్షతోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని కాకపోవును గాకనిరి. 
17  ఆయన వారిని చూచి - ఆలాగైతేఇల్లు కట్టువారు నిషేధించిన రాయిమూలకు తలరయి ఆయెను
18  అని వ్రాయబడిన మాట ఏమిటి? ఈ రాతిమీద పడుప్రతివాడును తునకలై పోవును అయితే అది ఎవని మీద పడునో వాని నలిచేయుననెను. 
19  ప్రధానయాజకులును శాస్త్రులును తమ్మునుగూర్చి ఆ ఉపమానము ఆయన చెప్పెనని గ్రహించి, ఆ గడియలోనే ఆయనను బలాత్కారముగా పట్టుకొన సమయము చూచిరి గాని జనులకు భయపడిరి. 
20  వారాయనను కనిపెట్టుచు, అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటలయందు తప్పు పట్టవలెనని, తాము నీతిమంతులని అనిపించుకొను చారులను ఆయనయొద్దకు పంపిరి. 
21  వారు వచ్చి - బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచునున్నావు; నీవెవనియందును పక్షపాతములేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగుదుము. 
22  మనము కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా అని ఆయన నడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తెరిగి 
23-24. - ఒక దేనారమునాకు చూపుడి. దీనిమీది రూపమును పైవ్రాతయు ఎవనివని అడుగగా వారు - కైసరువనిరి. 
25  అందుకాయన - అలాగైతే కైసరువి కైసరుకును దేవునివి దేవునికిని చెల్లించుడని వారితో చెప్పెను. 
26  వారు ప్రజలయెదుట ఈ మాటలో తప్పు పట్టనేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడి ఊరకుండిరి. 
27  తరువాత పునరుత్థానము లేదని చెప్పు సద్దూకయ్యలు కొందరు ఆయనయొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి 
28  - బోధకుడా, భార్య బ్రదికియుండగా ఒకని సహోదరుడు సంతానములేక చనిపోయినయెడల, అతని సహోదరుడతని భార్యను పెండ్లిచేసికొని తన సహోదరునికి సంతానము కలుగుజేయ వలెనని మోషే మనకు వ్రాసి యిచ్చెను. 3
29  మంచిది; యేడుగురు సహోదరులుండిరి. మొదటివాడొక స్త్రీని పెండ్లిచేసికొని సంతానములేక చనిపోయెను. 
30  రెండవవాడును మూడవవాడును ఆమెను పెండ్లిచేసికొనిరి. 
31  ఆ ప్రకారమే యేడుగురును ఆమెను పెండ్లాడి సంతానములేకయే చనిపోయిరి. 
32  పిమ్మట ఆ స్త్రీయు చనిపోయెను. 
33  కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును? ఆ యేడుగురికిని ఆమె భార్యగా ఉండెను గదా అనిరి. 
34  అందుకు యేసు - ఈ లోకజనులుపెండ్లి చేసికొందురు పెండ్లికియ్యబడుదురు గాని 
35  పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు పెండ్లికియ్యబడరు. 
36  వారు పునరుత్థానములో పాలివారైయుండి, 5దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు. 
37-38. పొదభాగములో- ప్రభువు అబ్రాహాముయొక్క దేవుడనియు ఇస్సాకుయొక్క దేవుడనియు యాకోబుయొక్క దేవుడనియు చెప్పుచు, మృతులు లేతురని మోషే సూచించెను; ఆయన సజీవులకే దేవుడుకాని మృతులకు దేవుడు కాడు; ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చెను. 
39-40. తరువాత వారాయనను మరేమియు అడుగ తెగింపలేదు గనుక శాస్త్రులలో కొందరు - భోధకుడా, నీవు యుక్తముగా చెప్పితివనిరి. 
41  అంతట ఆయన వారిని చూచి - క్రీస్తు దావీదు కుమారుడని మీరేలాగు చెప్పుచున్నారు -  
42-43. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగాఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమనిప్రభువు నా ప్రభువుతో చెప్పెను. అని కీర్తనల గ్రంథములో దావీదే చెప్పుచున్నాడు. 7
44  దావీదు ఆయనను ప్రభువని చెప్పినయెడల ఆయన ఏలాగు అతని కుమారుడగునని చెప్పెను. 
45  ప్రజలందరు వినుచుండగా ఆయన ఇట్లనెను - శాస్త్రులునుగూర్చి జాగ్రత్తపడుడి. వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగ గోరుచు 
46  సంతవీధులలో వందనములను, సమాజమందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. 
47  వారు విధవరాండ్ల యిండ్లను దిగమ్రింగుచు, మాయవేషముగా దీర్ఘప్రార్థనలు చేయుదురు. వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పెను. 
Download Audio File

No comments:

Post a Comment