1 అంతలో ఒకనినొకడు త్రొక్కుకొనునట్లు వేలకొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగెను –పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండినిగూర్చి జాగ్రత్తపడుడి.
2 మరుగైనదేదియు బయలుపరచబడకపోదు; రహస్యమైనదేదియు తెలియబడకపోదు.
3 అందుచేత మీరు చీకటిలో మాటలాడుకొనునవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవిలో చెప్పుకొనునది మిద్దెలమీద చాటింపబడును.
4 నా స్నేహితులైన మీతో నేను చెప్పునదేమనగా - దేహమును చంపిన తరువాత మరేమియు చేయనేరనివారికి భయపడకుడి.
5 ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియజేయుదును; చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను.
6 అయిదు పిచ్చుకలు రెండు కాసులకు అమ్మబడును గదా; అయినను వాటిలో ఒకటైనను దేవునియెదుట మరువబడదు.
7 మీ తలవెండ్రుకలన్నియు లెక్కింపబడియున్నవి, భయపడకుడి; మీరు అనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్టులు కారా?
8 మరియు నేను మీతో చెప్పునదేమనగా, నన్ను మనుష్యులయెదుట ఒప్పుకొనువాడెవడో, మనుష్యకుమారుడు దేవుని దూతలయెదుట వానిని ఒప్పుకొనును.
9 మనుష్యులయెదుట నన్ను ఎరుగననువానిని నేను ఎరుగనని దేవుని దూతలయెదుట చెప్పుదును.
10 మనుష్యుకుమారునిమీద వ్యతిరేకముగా ఒకమాట పలుకువానికి పాపక్షమాపణ కలుగునుగాని పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదు.
11 వారు సమాజమందిరముల పెద్దలయొద్దకును అధిపతులయొద్దకును అధికారులయొద్దకును మిమ్మును తీసికొనిపోవునప్పుడు మీరు - ఏలాగు ఏమి ఉత్తరమిచ్చెదమా, యేమి మాటలాడుదమా అని చింతింపకుడి;
12 మీరేమి చెప్పవలసినది పరిశుద్ధాత్మ ఆగడియలోనే మీకు నేర్పుననెను.
13 ఆ జనసమూహములో ఒకడు - బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలుపంచిపెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని ఆయన నడుగగా
14 ఆయన - ఓయీ, మీమీద తీర్పరినిగానైన పంచిపెట్టువానిగానైన నన్నెవడు నియమించెనని అతనితో చెప్పెను.
15 మరియు ఆయన వారితో - మీరు ఏవిధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్తపడుడి; ఒకని కలిమి విస్తరించుటవలన అది వాని జీవమునకు మూలముకాదనెను.
16 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను.
17 అప్పుడతడు - నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తానాలోచించుకొని - నేనీలాగు చేతును;
18 నా కొట్లు విప్పి వాటికంటె గొప్పవాటిని కట్టించి, అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని
19 నా ప్రాణముతో - నా ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది; సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను.
20 అయితే దేవుడు - వెర్రివాడా, యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని అతనితో చెప్పెను.
21 దేవునియెడల ధనవంతుడు కాక తనకొరకే సమకూర్చుకొనువాడు ఆలాగుననే యుండునని చెప్పెను.
22 అంతట ఆయన తన శిష్యులతో ఇట్లనెను - ఈ హేతువుచేత మీరు - ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చియైనను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చియైనను చింతింపకుడి.
23 ఆహారముకంటె ప్రాణమును వస్త్రముకంటె దేహమును గొప్పవి కావా?
24 కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు; అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు; మీరు పక్షులకంటె ఎంతో శ్రేష్ఠులు.
25 మరియు మీలో ఎవడు చింతించుటవలన తన యెత్తును మూరెడెక్కువచేసికొనగలడు?
26 కాబట్టి అన్నిటికంటె తక్కువైనవి మీచేత కాకపోతే తక్కిన వాటినిగూర్చి మీరు చింతింపనేల?
27 పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, ఒడకవు; అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదానివలెనైన అలంకరిపబడలేదని మీతో చెప్పుచున్నాను.
28 నేడు పొలములో ఉండి రేపు పొయిలో వేయబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించినయెడల, అల్పవిశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును.
29 ఏమి తిందుమో యేమి త్రాగదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగియుండకుడి.
30 ఈ లోకపు జనులు వీటినన్నిటిని వెదకుదురు; ఇవి మీకు కావలసియున్నవని మీ తండ్రికి తెలియును.
31 మీరైతే ఆయన రాజ్యమునువెదకుడి; దీనితో కూడ ఇవి మీకనుగ్రహింపబడును.
32 చిన్న మందా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైయున్నది
33 మీకు కలిగినవాటిని అమ్మి ధర్మముచేయుడి, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనుడి; అక్కడికి దొంగ రాడు చిమ్మెట కొట్టదు
34 మీ ధనమెక్కడ ఉండునో అక్కడనే మీ హృదయము ఉండును.
35 మీ నడుములు కట్టుకొనియుండుడి, మీ దీపములు వెలుగుచుండనియ్యుడి.
36 తమ ప్రభువు పెండ్లివిందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపుతీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతనికొరకు ఎదురుచూచు మనుష్యులవలె ఉండుడి.
37 ప్రభువు వచ్చి యే దాసులు మెళుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజనపంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.
38 మరియు అతడు రెండవ జామున వచ్చినను మూడవ జామున వచ్చినను (ఏ దాసులు) మెళుకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు.
39 దొంగ యే గడియను వచ్చునో యింటి యజమానునికి తెలిసిన పక్షమున అతడు మెళకువగా ఉండి తన యింటికి కన్నము వేయనియ్యడని తెలిసికొనుడి.
40 మీరు అనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పెను.
41 అప్పుడు పేతురు - ప్రభువా, యీ ఉపమానము మాతోనే చెప్పుచున్నావా అందరితోను చెప్పుచున్నావా? అని ఆయన నడుగగా
42 ప్రభువు ఇట్లనెను - తగిన కాలమున ప్రతివానికి ఆహారము పెట్టుటకు యాజమానుడు తన యింటివారిమీద నియమించునట్టి నమ్మకమైన బుద్ధిగల గృహనిర్వాహకుడెవడు?
43 ఎవని ప్రభువు వచ్చి వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యడు.
44 అతడు తనకు కలిగినది అంతటి మీద వాని ఉంచునని మీతో నిజముగా చెప్పుచున్నాను.
45 అయితే ఆ దాసుడు - నా యజమానుడు వచ్చుట కాలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొని, దాసులను దాసీలనుకొట్టి, తిని త్రాగి మత్తుగా ఉండసాగితే
46 వాడు కనిపెట్టని దినములోను ఎరుగని గడియలోను ఆ దాసుని యజమానుడు వచ్చి వాని నరికించి అపనమ్మకస్థులతో వానికి పాలునియమించును.
47 తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడకయు అతని చిత్తముచొప్పున జరిగింపకయు ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును.
48 అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసినవానికి కొద్ది దెబ్బలే తగులును. ఎవనికి ఎక్కువగా ఇయ్యబడెనో వానియొద్ద ఎక్కువగా తీయజూతురు; మనుష్యలు ఎవనికి ఎక్కువగా అప్పగింతురో వానియొద్ద ఎక్కువగా అడుగుదురు గదా.
49 నేను భూమిమీద అగ్నివేయ వచ్చితిని; అది ఇది వరకే రగులుకొని యుండవలెనని యెంతో కోరుచున్నాను.
50 అయితే నేను పొందవలసిన బాప్తిస్మమున్నది; అది నెరవేరువరకు నేనెంతో ఇబ్బందిపడుచున్నాను.
51 నేను భూమిమీద సమాధానము కలుగజేయ వచ్చితినని మీరు తలంచుచున్నారా? సమాధానమును కాదు భేదమునే కలుగజేయ వచ్చితినని మీతో చెప్పుచున్నాను.
52 ఇప్పటినుండి ఒక ఇంటిలో అయిదుగురు వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు.
53 తండ్రి కుమారునికిని కుమారుడు తండ్రికిని తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికిని అత్త కోడలికిని కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను.
54 మరియు ఆయన జనసమూహములతో ఇట్లనెను - మీరు పడమటనుండి మబ్బు పైకి వచ్చుట చూచునప్పుడు –వాన వచ్చుచున్నదని వెంటనే చెప్పుదురు; ఆలాగే జరుగును.
55 దక్షణపు గాలి విసరుట చూచునప్పుడు వడగాలి కొట్టునని చెప్పుదురు; అలాగే జరుగును.
56 వేషధారులారా, మీరు భూమ్యాకాశముల వైఖరి గుర్తింప నెరుగుదురు; ఈ కాలమును మీరు గుర్తింప నెరుగరేల?
57 ఏది న్యాయమో మీ అంతట మీరు విమర్శింపరేల?
58 వాదించువానితోకూడ అధికారియొద్దకు నీవు వెళ్లుచుండగా తని చేతినుండి తప్పించుకొనుటకు త్రోవలోనే ప్రయత్నము చేయుము; లేదా, అతడొకవేళ నిన్ను న్యాయాధిపతియొద్దకు ఈడ్చుకొని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతుకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును.
59 నీవు కడపటికాసు చెల్లించువరకు వెలపలికి రానే రావని చెప్పుచున్నాననెను.
Download Audio File

No comments:
Post a Comment