1 అటుపిమ్మట ఆయన దేవుని రాజ్యసువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతిగ్రామములోను సంచారము చేయుచుండగా
2 పన్నెండుమంది శిష్యులును, అపవిత్రాత్మలును వ్యాధలును పోగొట్టబడిన కొందరు స్త్రీలును, అనగా ఏడు దయ్యములు వదలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదుయొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహాన్నయు, సూసన్నయు ఆయనతోకూడ ఉండిరి.
3 వీరును ఇతరులనేకులును తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారముచేయుచు వచ్చిరి.
4 బహు జనసమూహము కూడి ప్రతి పట్టణమునుండి ఆయనయొద్దకు వచ్చుచుండగా ఆయన ఉపమానరీతిగా ఇట్లనెను
5 - విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడి త్రొక్కబడెను గనుక ఆకాశపక్షులు వాటిని మ్రింగివేసెను.
6 మరికొన్ని రాతినేలను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయెను.
7 మరికొన్ని ముండ్లపొదల నడుమ పడెను; ముండ్లపొదలు వాటితో మొలిచి వాటినణచివేసెను.
8 మరికొన్ని మంచి నేలను పడెను; అవి మొలిచి నూరంతలుగా ఫలించెననెను. ఈ మాటలు పలుకుచు - వినుటకు చెవులు గలవాడు వినునుగాక అని బిగ్గరగా చెప్పెను.
9 ఆయన శిష్యులు - ఈ ఉపమానభావమేమిటని ఆయనను అడుగగా
10 ఆయన - దేవుని రాజ్యమర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడియున్నది; ఇతరులైతే చూచియు చూడకయ, వినియు గ్రహింపకయు ఉండనట్లు వారికి ఉపమానరీతిగా (బోధింపబడుచున్నవి. )
11 ఈ ఉపమానభావమేమనగా, విత్తనము దేవుని వాక్యము.
12 త్రోవప్రక్కనుండువారు, వారు వినువారుగాని నమ్మి రక్షణపొందకుండునట్లు అపవాదివచ్చి వారి హృదయములలోనుండి వాక్యమెత్తికొనిపోవును.
13 రాతినేలనుండువారెవరనగా, వినునప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెము కాలము నమ్మి శోధన కాలమున తొలిగిపోవుదురు.
14 ముండ్లపొదలలో పడిన (విత్తనమును పోలిన) వారెవరనగా, విని కాలము గడచినకొలది యీ జీవనసంబంధమైన విచారములచేతను ధనభోగములచేతను అణచివేయబడి పరపక్వముగా ఫలింపనివారు.
15 మంచి నేలనుండు (విత్తనమును పోలిన) వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు.
16 ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచముక్రింద పెట్టడు గాని లోపలికి వచ్చు వారికి అగుపడవలెనని దీపస్తంభముమీద దాని పెట్టును.
17 తేటపరచబడని రహస్యమేదియు లేదు; తెలియజేయబడకయు బయలుపడకయు నుండు మరుగైనదేదియు లేదు.
18 కలిగినవానికి ఇయ్యబడును, లేనివానియొద్దనుండి తనకు కలదని అనుకొనునదికూడ తీసివేయబడును గనుక మీరేలాగు వినుచున్నారో చూచుకొనుడని చెప్పెను.
19 ఆయన తల్లియు సహోదరులును ఆయనయొద్దకు వచ్చి, జనులు గుంపుగా ఉండుటచేత ఆయనదగ్గరకు రాలేకపోయిరి.
20 అప్పుడు - నీ తల్లియు నీ సహోదరులును నిన్నుచూడగగోరి వెలపట నిలిచియున్నారని యెవరో ఆయనకు తెలియజేసిరి.
21 అందుకాయన - దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునై యున్నారని వారితో చెప్పెను.
22 మరియొకనాడు ఆయన తన శిష్యులతోకూడ ఒక దోనెయెక్కి సరస్సుఅద్దరికి పోదమని వారితో చెప్పగా వారు ఆ దోనెను త్రోసి బయలుదేరిరి.
23 వారు వెళ్లుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలివాన సరస్సుమీదికి వచ్చి, దోనె నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి
24 గనుక ఆయనయొద్దకు వచ్చి - ప్రభూ ప్రభూ, నశించిపోవుచున్నామని చెప్పి ఆయనను లేపిరి. ఆయన లేచి గాలిని నీటిపొంగును గద్దింపగానే అవి అణగి నిమ్మళమాయెను.
25 అప్పుడాయన - మీ విశ్వాసమెక్కడ అని వారితో అనెను. అయితే వారు భయపడి - ఈయన గాలికిని నీళ్లకును ఆజ్ఞాపింపగా అవి లోబడుచున్నవే; యీయన యెవరో అని యొకనితోనొకడు చెప్పుకొని ఆశ్చర్యపడిరి.
26 వారు గలిలైయుకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చిరి.
27 ఆయన అద్దరి యెక్కినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై, బహుకాలమునుండి బట్టలు కట్టుకొనక గోరీలలోనేగాని యింట ఉండువాడు కాడు.
28 వాడు యేసును చూచి కేకలువేసి ఆయనయెదుట సాగిలపడి - యేసూ, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నీతో నాకేమి? నన్ను బాధపరచకుమని నిన్ను వేడుకొనుచున్నాను అని కేకలువేసిచెప్పెను.
29 ఏలయనగా ఆయన - ఆ మనుష్యుని విడిచి వెలపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వాని పట్టుచువచ్చెను గనుక వానిని గొలుసులతోను కాలి సంకెళ్లతోను కట్టి కావలియందుంచిరి గాని, వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోకి తరుముకొని పోయెను.
30-31. యేసు -నీ పేరేమని వాని నడుగగా చాలా దయ్యములు వానిలో చొచ్చియుండెను గనుక, వాడు తన పేరు సేన అని చెప్పి, పాతాళములోకి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకొనెను.
32 అక్కడ విస్తారమైన పందుల మంద కొండమీద మేయుచుండెను గనుక, వాటిలో చొచ్చుటకు తమకు సెలవిమ్మని ఆయనను వేడుగొనగా ఆయన సెలవిచ్చెను.
33 అప్పుడు దయ్యములు ఆ మనుష్యుని విడిచిపోయి పందులలో చొచ్చెను గనుక, ఆ మంద ప్రపాతమునుండి సరస్సులోకి వడిగా పరుగెత్తి ఊపిరి తిరుగక చచ్చెను.
34 మేపుచున్నవారు జరిగినదానిని చూచి పారిపోయి ఆ పట్టణములోను గ్రామములలోను ఆసంగతి తెలియజేసిరి.
35 జనులు జరిగినదానిని చూడ వెళ్లి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదలిపోయిన మనుష్యుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదములయొద్ద కూర్చుండుట చూచి భయపడిరి.
36 అది చూచినవారు దయ్యములు పట్టినవాడేలాగు స్వస్థతపొందెనో జనులకు తెలియజేయగా
37-38. గెరసీనీయుల దేశప్రాంతములలో నుండు జనులందరు బహుభయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి. ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా దయ్యములు వదలిపోయిన మనుష్యుడు, ఆయనతోకూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను.
39 అయితే ఆయన - నీవు నీ యింటికి తిరిగి వెళ్లి, దేవుడు నీకెంత గొప్పకార్యములు చెసెనో తెలియజేయుమని వానితో చెప్పి వాని పంపివేసెను; వాడు వెళ్లి యేసు తనకెంత గొప్ప కార్యములు చేసెనో ఆ పట్టణమందంతటను ప్రకటించెను.
40 జనసమూహము ఆయనకొరకు ఎదురుచూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి.
41 అంతట సమాజమందిరపు అధికారియైన యయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి
42 యించుమించు పన్నెండేండ్ల యీడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది గనుక తన యింటికి రమ్మని ఆయనను వేడుకొనెను. ఆయన వెళ్లుచుండగా జనసమూహములు ఆయనమీద పడుచుండిరి.
43 అప్పుడు పన్నెండేండ్లనుండి రక్తస్రావరోగముగల యొక స్త్రీయెవనిచేతను స్వస్థతనొందనిదై ఆయన వెనుకకు వచ్చి
44 ఆయన వస్త్రపుచెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను.
45 - నన్ను ముట్టినది ఎవరని యేసు అడుగగా అందరును - మేమెరుగమనినప్పుడు, పేతురు - యేలినవాడా, జనసమూహములు క్రిక్కిరిసి నీమీద పడుచున్నారనగా
46 యేసు - ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలోనుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను.
47 తాను మరుగైయుండలేదని ఆ స్త్రీ చూచి, వణకుచు వచ్చి ఆయనయెదుట సాగిలపడి, తాను ఎందునిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఏలాగు స్వస్థపడెనో ఆ సంగతి ప్రజలందరియెదుట తెలియజెప్పెను.
48 అందుకాయన -కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్మని ఆమెతో చెప్పెను.
49 ఆయన ఇంక మాటలాడుచుండగా సమాజమందిరపు అధికారి యింటనుండి యొకడు వచ్చి - నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమపెట్టవద్దని - అతనితో చెప్పెను.
50 యేసు ఆ మాట విని - భయపడవద్దు, నమ్మిక మాత్రముంచుము, ఆమె స్వస్థపరచబడునని అతనితో ఉత్తరమిచ్చి
51 యింటికి రాగా పేతురు యోహాను యాకోబు అను వారిని ఆ చిన్నదాని తలిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియ్యలేదు.
52 అందరును ఆమె నిమిత్తమై యేడ్చుచు రొమ్ముకొట్టుకొనుచుండగా ఆయన వారితో - ఏడ్వవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను.
53 వారామె చనిపోయెనని యెరిగి ఆయనను అపహసించిరి.
54 అయితే ఆయన ఆమె చెయ్యిపట్టుకొని - చిన్నదానా, లెమ్మని చెప్పగా
55 ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడాయన - ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను.
56 - ఆమె తలిదండ్రులు విస్మయము నొందినవారైరి. అంతట ఆయన - జరిగినది ఎవనితోను చెప్పవద్దని వారికాజ్ఞాపించెను.
Download Audio File

No comments:
Post a Comment