1 పిలాతు గలిలైయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్నకొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా
2 ఆయన వారితో ఇట్లనెను - ఈ గలిలైయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలైయులందరికంటె పాపులని మీరు తలంచుచున్నారు?
3 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందని పక్షమున మీరందరును ఆలాగే నశింతురు.
4 మరియు సిలోయములోని గోపురము పడి చచ్చిన ఆ పదునెనిమిది మంది యెరూషలేములో కాపురమున్నవారందరికంటె అపరాధులని తలంచుచున్నారా?
5 కారని మీతో చెప్పుచున్నాను; మీరు మారుమనస్సు పొందని పక్షమున మీరందరును ఆలాగే నశింతురు.
6 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను - ఒక మనుష్యుని ద్రాక్షాతోటలో అంజారపు చెట్టొకటి నాటబడి యుండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియు దొరకలేదు
7 గనుక అతడు - ఇదిగో మూడేండ్లనుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని యేమియుదొరకలేదు; దీని నరికివేయుము, దీనివలన ఈ భూమియు ఏల వ్యర్థమై పోవలెనని ద్రాక్షాతోటమాలితో చెప్పెను.
8 అయితే వాడు - అయ్యా, నేను దాని చుట్టు త్రవ్వి యెరువు వేయుమట్టుకు ఈ సంవత్సరముకూడ ఉండనిమ్ము;
9 అది ఫలించిన సరి, లేనియెడల నరికించివేయుమని అతనితో చెప్పెను.
10 విశ్రాంతిదినమున ఆయన యొక సమాజమందిరములో బోధించుచున్నప్పుడు
11 పదునెనిమిది ఏండ్లనుండి బలహీనపరచు దయ్యముపట్టిన యొక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి యెంతమాత్రమును చక్కగా నిలువబడలేకుండెను.
12 యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి -అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొందియున్నావని ఆమెతో చెప్పి
13 ఆమెమీద చెతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచెను.
14 యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచినందున ఆ సమాజమందిరపు అధికారి కోపముతో మండిపడి, జనసమూహమును చూచి - పనిచేయదగిన ఆరు దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థతపొందుడి; విశ్రాంతిదినమందు రావద్దని చెప్పెను.
15 అందుకు ప్రభువు - వేషధారులారా, మీలో ప్రతివాడును విశ్రాంతిదినమున తన యెద్దునైనను గాడిదెనైనను గాడియొద్దనుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును గదా.
16 ఇదిగో పదునెనిమిది ఏండ్లనుండి సాతాను బంధించిన అబ్రాహాము కుమార్తెయైన యీమెను విశ్రాంతిదినమందు ఈ కట్లనుండి విడిపింపదగదా?అని అతనితో చెప్పెను.
17 ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నెదిరించిన వారందరు సిగ్గుపడిరి; అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూచి సంతోషించెను.
18 ఆయన -దేవుని రాజ్యము దేని పోలియున్నది, దేనితో దాని పోల్తును?
19 ఒక మనుష్యుడు తీసికొని తన తోటలోవేసిన అవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయెను; ఆకాశపక్షులు దాని కొమ్మలయుందు నివసించెననెను.
20 మరల ఆయన - దేవుని రాజ్యము దేనితో పోల్తును?
21 ఒక స్త్రీ తీసికొని, అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నదని చెప్పెను.
22 ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవుచు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను.
23 ఒకడు - ప్రభువా, రక్షణ పొందువారు కొద్దిమందేనా? అని ఆయన నడుగగా
24 ఆయన వారిని చూచి - ఇరుకు ద్వారమున ప్రవేశింపపోరాడుడి; అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను.
25 ఇంటి యజమానుడు లేచి తలుపువేసిన తరువాత మీరు వెలపల నిలిచి తలుపు తట్టి -అయ్యా, మాకు తలుపు తీయుమని చెప్ప నారంభించినప్పుడు
26 ఆయన - మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు - నీ సముఖమందు మేము తిని త్రాగుచుంటిమే; నీవు మా వీధులలో బోధించితివే అని చెప్పసాగుదురు.
27 అప్పుడాయన - మీరెక్కడివారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను; అక్రమముచేయు మీరందరు నాయొద్దనుండి తొలగిపొండని చెప్పును.
28 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో నుండుటయు, మీరు వెలపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.
29 మరియు జనులు తూర్పునుండియు పడమటనుండియు ఉత్తరమునుండియు దక్షిణమునుండియు వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు.
30 ఇదిగో కడపటివారిలో కొందరు మొదటివారగుదురు, మొదటివారిలో కొందరు కడపటివారగుదురని చెప్పెను.
31 ఆ గడియలోనే కొందరు పరిసయ్యలు వచ్చి నీవిక్కడనుండి బయలుదేరి పొమ్ము; హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా
32 ఆయన వారిని చూచి - మీరు వెళ్లి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి - ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్లగొట్టుచు (రోగులను) స్వస్థపరచుచునుండి మూడవదినమున పూర్ణసిద్ధి పొందెదను
33 అయినను నేడు రేపు ఎల్లుండి నా త్రోవను నేను పోవుచుండవలెను; ప్రవక్త యెరూషలేముకు వెలపల నంశింప వల్లపడదు.
34 యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కలక్రింద ఏలాగు చేర్చుకొనునో ఆలాగే ఎన్నోమారులు నేను నీ పిల్లలను చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరొల్లకపోతిరి.
35 ఇదిగో మీ యిల్లు మీకు పాడుగా విడువబడుచున్నది - ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పు పర్యంతము మీరు నన్నుచూడరని మీతో చెప్పుచున్నాననెను.
Download Audio File

No comments:
Post a Comment