1 ఆదివారమున తెల్లవారగా తాము సిద్ధపరచిన సుగంధద్రవ్యములను తీసికొని సమాధియొద్దకు వచ్చి
2 సమాధిముందర ఉండిన రాయి దొరలింపబడి యుండుట చూచి లోపలికి వెళ్లిరి గాని
3 ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు.
4 ఇందునుగూర్చి వారికేమియు తోచకయుండగా, ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన యిద్దరు మనుష్యులు వారియొద్ద నిలువబడిరి.
5 వారు భయపడి ముఖములు నేలను మోపియుండగా వీరు - సజీవుడైనవానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు?
6 ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచియున్నాడు; ఆయన ఇంక గలిలైయలో ఉన్నప్పుడు
7 - మనుష్యకుమారుడు పాపిష్ఠులైన మనుష్యులచేతికి అప్పగింపబడి, సిలువవేయబడి, మూడవ దినమందు లేవవలసియున్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొనుడని వారితో అనిరి.
8 అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసికొని
9 సమాధియొద్దనుండి తిరిగి వెళ్లి, యీ సంగతులన్నియు పదకొండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి.
10 ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారెవరనగా - మగ్దలేనే మరియయు యోహాన్నయు యాకోబు తల్లియైన మరియయు వారితో కూడ ఉన్న యితర స్త్రీలును.
11 అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రిమాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు.
12 అయితే పేతురు లేచి, సమాధియొద్దకు పరుగెత్తిపోయి వంగిచూడగా, నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగినదానిని చూచి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్లెను.
13 ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేముకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అను ఒక గ్రామమునకు వెళ్లుచు
14 సంభవించిన ఈ సంగతులన్నిటిని గూర్చి యొకనితోనొకడు సంభాషించుచుండిరి.
15 వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా, యేసు తానే దగ్గెరకు వచ్చి వారితోకూడ నడిచెను;
16 అయితే వారాయనను గుర్తుపట్టలేకుండ వారి కన్నులు మూయబడెను.
17 ఆయన - మీరు నడుచుచు ఒకనితో ఒకడు చెప్పుకొనుచున్న యీ మాట లేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి.
18 వారిలో క్లెయొప అను ఒకడు - యెరూషలేములో బసచేయుచుండి యీ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవొకడవే యెరుగవా అని ఆయనను అడిగెను.
19 ఆయన - అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు - నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే; ఆయన దేవునియెదుటను ప్రజలందరియెదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తయై యుండెను.
20 మన ప్రధాన యాజకులును అధికారులును ఆయనను ఏలాగు మరణ శిక్షకు అప్పగించి సిలువవేయించిరో నీకు తెలియదా?
21 ఇశ్రాయేలును విమోచింపబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి; ఇదియు గాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములాయెను.
22 అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధియొద్దకు వెళ్లి, ఆయన దేహమును కానక వచ్చి
23 - కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రదికియున్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగజేసిరి.
24 మాతోకూడ నున్న వారిలో కొందరు సమాధియొద్దకు వెళ్లి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి గాని, ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి.
25 అందుకాయన - అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నియు నమ్మని మందమతులారా,
26 క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి
27 మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్నుగూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.
28 ఇంతలో తాము వెళ్లుచున్న గ్రామము దగ్గెరకు వచ్చినప్పుడు ఆయన ఇంక కొంతదూరము వెళ్లునట్లు అగుపడాగ
29 వారు - సాయంకాలము కావచ్చినది, ప్రొద్దుగ్రుంకినది, మాతోకూడ ఉండుమని చెప్పి, ఆయనను బలవంతముచేసిరి గనుక ఆయన వారితోకూడ ఉండుటకు లోపలికి వెళ్లెను.
30 ఆయన వారితోకూడ భోజనమునకు కూర్చున్నప్పుడు, ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రముచేసి దాని విరిచి వారికి పంచిపెట్టగా
31 వారి కన్నులు తెరువబడి ఆయనను గుర్తుపట్టిరి; అంతట ఆయన వారికి అదృశ్యుడాయెను.
32 అప్పుడు వారు - ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి.
33 ఆ గడియలోనే వారు లేచి యెరూషలేముకు తిరిగి వెళ్లగా, పదకొండుగురు శిష్యులును వారితోకూడ ఉన్నవారును కూడివచ్చి
34 - ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనబడెనని చెప్పుకొనుచుండిరి. వారది విని
35 త్రోవలో జరిగిన సంగతులును, ఆయన రొట్టె విరుచుటవలన తమకేలాగు తెలియబడెనో అదియు తెలియజేసిరి.
36 వారు ఈలాగు మాటలాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి - మీకు సమాధానమవుగాకని వారితో అనెను.
37 అయితే వారు దిగులుపడి భయాక్రాంతులై, భూతముతమకు కనబడెనని తలంచిరి.
38 అప్పుడాయన - మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేల?
39 నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి; నన్నుపట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న యెముకలును మాంసమును భూతమునకుండవని చెప్పి
40 తన చేతులను పాదములను వారికి చూపెను.
41 అయితే వారు సంతోషముచేత ఇంక నమ్మక ఆశ్చర్యపడుచుండగా ఆయన - ఇక్కడ మీ యొద్ద ఏమైన ఆహారము కలదా అని వారినడిగెను.
42 వారు కాల్చిన చేపముక్కను ఆయన కిచ్చిరి.
43 ఆయన దాని తీసికొని వారియొదుట భుజించెను.
44 అంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పెను.
45 అప్పుడ వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సు తెరచి
46 - క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలోనుండి లేచుననియు
47 యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు.
48-49. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను; మీరు పైనుండి శక్తి పొందువరకు పట్టణములో నిలిచియుండుడని వారితో చెప్పెను.
50 తరువాత ఆయన బేతనియవరకు వారిని తీసికొనిపోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను.
51 వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలోనుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను.
52 వారు ఆయనకు నమస్కారముచేసి మహా ఆనందముతో యెరూషలేముకు తిరిగి వెళ్లి
53 యెడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి.
Download Audio File

No comments:
Post a Comment