1 ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు - ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.
2 అందుకాయన - మీరు ప్రార్థన చేయునప్పుడు - తండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చునుగాక,
3 మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;
4 మేము మా కచ్చియున్న ప్రతివాని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము; మమ్మును శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పెను.
5 మరియు ఆయన వారితో ఇట్లనెను - ఎవనికైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితునియొద్దకు వెళ్లి - స్నేహితుడా, నాకు మూడు రొట్టెలు బదులిమ్ము;
6 నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చియున్నాడు; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల
7 అతడు లోపటనేయుండి - నన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొనియున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?
8 అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటిమాటికి అడుగుటవలననైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.
9 అటువలె మీరును అడుగుడి, మీకియ్యబడును; వెదకుడి, మీకు దొరుకును; తట్టుడి మీకు తీయబడును.
10 అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
11 మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేప అడిగితే చేపకు ప్రతిగా పాము ఇచ్చునా? గుడ్డు అడిగితే తేలు ఇచ్చునా?
12 కాబట్టి మీరు చెడ్డవారైయుండియు మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగి యుండగా
13 పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి ఎంతో నిశ్చయముగా పరశుద్ధాత్మను అనుగ్రహించుననెను.
14 ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను. ఆదయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాటలాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
15 అయితే వారిలో కొందరు - వీడు దయ్యములకు అధిపతియైన బయల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొనిరి.
16 మరికొందరు ఆయనను శోధించుచు - పరలోకమునుండి యొక సూచక్రియను చూపుమని ఆయన నడిగిరి.
17 ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెను - తనకు తానేవ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యముపాడైపోవును; ఇంటికి విరోధమైన యిల్లు కూలిపోవును.
18 సాతానును తనకు వ్యతిరేకముగా తానే వేరుపడినపక్షమున వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.
19 నేను బయల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.
20 అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
21 బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనునప్పుడు తన సొత్తు భద్రముగా ఉండును.
22 అయితే అతనికంటె బలవంతుడైన యొకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.
23 నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టవాడు.
24 అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేనిచోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున - నేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
25 వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చియుండుటచూచి
26 వెళ్లి తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డదగునని చెప్పెను.
27 ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక స్త్రీ ఆయనను చూచి - నిన్నుమోసిన గర్భమును నీవు కుడిచిన స్తన్యములును ధన్యములైనవని కేకలువేసి చెప్పగా
28 ఆయన - అవునుగాని దేవుని వాక్యము విని దాని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
29 మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఈలాగు చెప్పసాగెను - ఈ తరమువారు దుష్టతరమువారైయుండి సూచకక్రియ నడుగచున్నారు. అయితే యోనానుగూర్చిన సూచకక్రియయే గాని మరి ఏ సూచకక్రియయు వీరికి అనుగ్రహింపబడదు.
30 యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచకముగా ఉండెనో ఆలాగే మనుష్యుకుమారుడును ఈ తరమువారికి సూచకముగా ఉండును.
31 దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితోకూడ లేచి వారిమీద నేరస్థానచేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
32 నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరము వారితోకూడ నిలువబడి వీరిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సుపొందిరి; ఇదిగో యోనాకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
33 ఎవడును దీపము వెలిగించి చాటుచోటనైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.
34 నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్నుతేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమైయుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమైయుండును.
35 కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచుకొనుము.
36 ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగమయమైతే దీపము తన కాంతివలన నీకు వెలుగిచ్చునప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమైయుండునని చెప్పెను.
37 ఆయన బోధించుచుడగా ఒక పరిసయ్యుడు తనతోకూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భజనపంక్తిని కూర్చుండెను.
38 ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
39 అందుకు ప్రభువిట్లనెను - పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలపట శుద్ధిచేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడుతనముతోను నిండియున్నది.
40 అవివేకులారా, వెలుపటి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా?
41 కాగా మీకు కలిగినవి ధర్మముచేయుడి, అప్పుడు మీకన్నియు శుద్ధిగా ఉండును.
42 అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనాసదాప మొదలైన ప్రతి కూరలోను పదియవ వంతు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చేయవలసియున్నది.
43 అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజమందిరమలలో అగ్రపీఠములను సంతవీధులలో వందనములను కోరుచున్నారు.
44 అయ్యో, మీరు కనబడని సమాధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను.
45 అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు - బోధకుడా, యీలాగు చెప్పి మమ్ముకూడ నిందించుచున్నావని ఆయనతో చెప్పగా
46 ఆయన - అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయ శక్యముకాని బరువులను మీరు మనుష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.
47 అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల గోరీలను మీరు కట్టించుచున్నారు.
48 కావున మీరు సాక్షులై మీ పితరులకార్యములకు సమ్మతించుచున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి గోరీలు కట్టించుదురు.
49 అందుచేత దేవుని జ్ఞానము చెప్పినదేమనగా - నేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.
50 వారు కొందరిని చంపుదురు కొందరిని హంసింతురు.
51 కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను నశించిన జకర్యా రక్తమువరకుచిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరమువారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను.
52 అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొనిపోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.
53-54. ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరసయ్యులును ఆయనమీద నిండ పగపట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోటనుండి వచ్చినది ఏదైనను పట్టుకొనుటకై పొంచి వెదకుచు అనేక సంగతులనుగూర్చి ఆయనను మాటలాడింపసాగిరి.
Download Audio File

No comments:
Post a Comment