1 విశ్రాంతిదినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని యింటిలోకి వెళ్లినప్పుడు, ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి.
2 అప్పుడు జలోదరరోగముగల యొకడు ఆయనయెదుట ఉండెను.
3-4. యేసు - విశ్రాంతిదినమున స్వస్థపరచుట న్యాయమా కాదా? అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారూరకుండిరి. అప్పుడాయన వాని చేరదీసి స్వస్థపరచి పంపివేసి
5 - మీలో ఎవని గాడిదెయైననుఎద్దయినను గుంటలో పడినయెడల విశ్రాంతిదినమున దాని పైకి తీయడా? అని వారినడిగెను.
6 ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి.
7 పిలువబడినవారు భోజనపంక్తిని అగ్రపీఠమును ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను
8 నిన్నెవరైనను పెండ్లివిందుకు పిలిచినప్పుడు అగ్రపీఠముమీద కూర్చుండవద్దు; ఒకవేళ నీకంటె ఘనుడు అతని చేత పిలువబడగా
9 నిన్నును అతనిని పిలిచినవాడు వచ్చి - ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును, అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగుదువు.
10 అయితే నీవు పిలువబడునప్పుడు, నిన్ను పిలిచినవాడు వచ్చి - స్నేహితుడా, పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటున కూర్చుండుము; అప్పుడు నీతోకూడ కూర్చుండువారందరియెదుట నీకు ఘనత కలుగును.
11 తన్నుతాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడునని చెప్పెను.
12 మరియు ఆయన తన్ను పిలిచినవానితో ఇట్లనెను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు, నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులగు నీ పొరుగువారినైనను పిలువవద్దు; వారు ఒకవేళ నిన్ను మరల పిలుతురు గనుక నీకు ప్రత్యపకారము కలుగును.
13 అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీనులను కుంటివాండ్లను గుడ్డివాండ్లను పిలువుము.
14 నీకు ప్రత్యపకారము చేయుటకు వారికేమియు లేదు గనుక నీవు ధన్యుడవగుదువు; నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారము పొందుదువని చెప్పెను.
15 అయనతోకూడ భోజనపంక్తిని కూర్చుండినవారిలో ఒకడు ఈ మాటలు విని - దేవుని రాజ్యములో భోజనముచేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పగా
16 ఆయన అతనితో నిట్లనెను - ఒక మనుష్యుడు గొప్పవిందు చేయించి అనేకులను పిలిచెను.
17 విందుకాలమందు అతడు - ఇప్పుడు సిద్ధమై యున్నది, రండని పిలువబడినవారితో చెప్పుటకై తన దాసుని పంపెను.
18 అయితే వారందరు ఏకమనస్సుతో నెపములు చెప్పసాగిరి. మొదటివాడు - నేనోక పొలము కొనియున్నాను, అవశ్యముగా వెళ్లి దాని చూడవలెను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
19 మరియొకడు నేను అయిదు జతల యెడ్లను కొనియున్నాను, వాటిని పరీక్షింప వెళ్లుచున్నాను, నన్ను క్షమింపవలెనని నిన్ను వేడుకొనుచున్నాననెను.
20 మరియొకడు - నేనోక స్త్రీని వివాహము చేసికొన్నాను; అందుచేత నేను రాలేననెను.
21 అప్పుడా దాసుడు తిరిగి వచ్చి యీ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ యింటి యజమానుడు కోపపడి - నీవు త్వరగా పట్టణపు వీధులలోకిని సందులలోకిని వెళ్లి, బీదలను అంగహీనులను కుంటివారిని గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను.
22 అంతట దాసుడు - ప్రభువా, నీవాజ్ఞాపించినట్టు చేసితినిగాని యింకను చోటున్నదని చెప్పెను.
23 అందుకు యజమానుడు - నా యిల్లు నిండునట్లు నీవు రాజమార్గములోకిని కంచెలలోకిని వెళ్లి అక్కడి వారిని లోపలికి వచ్చుటకు బలవంతము చేయుము;
24 ఏలయనగా పిలువబడిన ఆ మనుష్యులలో ఒకడును నా విందు రుచిచూడడని మీతో చెప్పుచున్నాననెను.
25 -26. బహు జనసమూహములు ఆయనతోకూడ వెళ్లుచున్నప్పుడు ఆయన వారితట్టు తిరిగి - ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కచెల్లెండ్లను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
27 మరియు తన సిలువను మోసికొని నన్ను వెంబడింపనివాడు నా శిష్యుడు కానేరడు.
28 మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపవలెనని యుంటే దానికొనసాగించుటకు కావలసినది తనయొద్ద ఉన్నదోలేదో అని మొదట కూర్చుండి తగులుబడి లెక్కచూచుకొనడా?
29 చూచుకొననిపక్షమున ఆతడు దాని పునాదివేసి, ఒకవేళ దాని కొనసాగింపలేకపోయినందున
30 చూచువారందరు - ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టెను గాని కొనసాగింపలేకపోయెనని అతని చూచి యెగతాళి చేయసాగుదురు.
31 మరియు ఏ రాజైనను మరియొక రాజుతో యుద్ధము చేయబోవునప్పుడు తనమీదికి ఇరువదివేలమందితో వచ్చువానిని పదివేలమందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని మొదట కూర్చుండి ఆలోచింపడా?
32 శక్తి లేనియెడల అతడింకను దూరముగా ఉన్నప్పుడే రాయభారము పంపి సమాధానము చేసికొన చూచును గదా.
33 ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచి పెట్టనివాడు నా శిష్యుడు కానేరడు.
34 ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైతే దేనివలన దానికి సారము కలుగును?
35 అది భూమికైనను ఎరువుకైనను పనికి రాదు గనుక దాని బయట పారవేయుదురు. వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని వారితో చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment