1 పస్కా అనబడిన పులియని రొట్టెల పండుగ సమీపించెను.
2 ప్రధానయాజకులును శాస్త్రులును ప్రజలకు భయపడిరి గనుక ఆయనను ఏలాగు చంపింతుమని ఉమాయము వెదకుచుండిరి.
3 అంతట పన్నెండుమంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదాలో సాతాను ప్రవేశించెను
4 గనుక వాడు వెళ్లి, ఆయనను వారికేలాగు అప్పగింప వచ్చునో దానిగూర్చి ప్రధానయాజకులతోను అధిపతులతోను మాటలాడెను.
5 అందుకు వారు సంతోషించి వానికి ద్రవ్యమియ్య సమ్మతించిరి.
6 వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయము వెదకుచుండెను.
7 పస్కాను వధింపవలసిన పులియని రొట్టెల దినమురాగా
8 యేసు పేతురును యోహానును చూచి - మీరు వెళ్లి మనము పస్కాను భుజించుటకై మనకొరకు సిద్ధపరచుడని వారిని పంపెను.
9 వారు - మేమెక్కడ సిద్ధపరచగోరుచున్నామని ఆయనను అడుగగా
10 ఆయన - ఇదిగో మీరు పట్టణములో ప్రవేశించునప్పుడు నీళ్లకుండ మోసికొనిపోవుచున్న యొకడు మీకు ఎదురుగా వచ్చును; అతడు ప్రవేశించు ఇంటిలోకి అతని వెంట వెళ్లి
11 - నేను నా శిష్యులతోకూడ పస్కాను భుజించుటకు విడిది గది యెక్కడనని బోధకుడు నిన్నడుగుచున్నాడని యింటి యజమానునితో చెప్పుడి.
12 అతడు సామగ్రిగల యొక గొప్ప మేడగది మీకు చూపించును; అక్కడ సిద్ధపరచుడని వారితో చెప్పెను.
13 వారు వెళ్లి ఆయన తమతో చెప్పినట్టు కనుగొని పస్కాను సిద్ధపరచిరి.
14 ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు ఆయనతో కూడ అపోస్తలులును పంక్తిని కూర్చుండిరి.
15 అప్పుడాయన - నేను శ్రమపడకమునుపు మీతోకూడ ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని.
16 అది దేవుని రాజ్యములో నెరవేరువరకు ఇక ఎన్నడును దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారితో చెప్పి
17 ఆయన గిన్నె ఎత్తికొని మీలో పంచుకొనుడి;
18 ఇకమీదట దేవుని రాజ్యము వచ్చువరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాననెను.
19 పిమ్మట ఆయన యొక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని విరిచి, వారికిచ్చి - ఇది మీకొరుక ఇయ్యబడుచున్న నా శరీరము; నన్ను జ్ఞాపకము చేసికొనుటకు ఇది చేయుడని చెప్పెను.
20 ఆ ప్రకారమే భోజనమైన తరువాత ఆయన గిన్నెయు పట్టుకొని -ఈ గిన్నె మీకొరకు చిందింపబడుచున్న నా రక్తమువలననైన క్రొత్తనిబంధన.
21 ఇదిగో నన్ను అప్పగించువాని చెయ్యి నాతోకూడ ఈ బల్లమీద ఉన్నది.
22 నిర్ణయింపబడిన ప్రకారము మనుష్యకుమారుడు పోవుచున్నాడు గాని ఆయన ఎవనిచేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యునికి శ్రమయని చెప్పెను.
23 వారు - ఈ పని చేయబోవువాడెవడో అని తమలోతాము అడుగుకొనసాగిరి.
24 తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అను వివాదము వారికి పుట్టగా
25 ఆయన వారితో ఇట్లనెను - అన్యజనములలో రాజులు వారిమీద ప్రభుత్వము చేయుదురు, వారిమీద అధికారము చేయువారు ఉపకారులనబడుదురు.
26 మీరైతే ఆలాగు ఉండరాదు, మీలో గొప్పవాడు చిన్నవానివలెను, అధిపతి పరిచారకునివలెను ఉండవలెను.
27 గొప్పవాడెవడు? భోజనపంక్తిని కూర్చుండువాడా పరిచర్య చేయువాడా? పంక్తిని కూర్చుండువాడే గదా? అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువానివలె ఉన్నాను.
28 నా శ్రమలలోనాతోకూడ నిలిచియున్నవారు మీరే;
29 29-30. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.
30 29-30. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్లయొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహసనములమీద కూర్చుండి ఇశ్రాయేలు పన్నెండు గోత్రములవారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను.
31 సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమలవలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను గాని
32 నీ నమ్మిక తప్పిపోకుండునట్లు నేను నీకొరకు వేడుకొంటిని; నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పెను.
33 అయితే అతడు - ప్రభువా, నీతోకూడ చెరలోకిని మరణమునకును వెళ్లుటకు సిద్ధముగా ఉన్నాని ఆయనతో అనగా
34 ఆయన -పేతురూ, నీవు నన్నెరుగనని ముమ్మారు చెప్పువరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాననెను.
35 మరియు ఆయన - నేనుమిమ్మును, సంచియు జాలెయు చెప్పులును లేకుండ పంపినప్పుడు, మీకు ఏమైనను తక్కువాయెనా అని వారినిడిగినప్పుడు వారు - ఏమియు తక్కువ కాలేదనిరి.
36 అందుకాయన - ఇప్పుడైతే సంచిగలవాడు సంచియు జాలెయు తీసికొని పోవలెను, కత్తిలేనివాడు తన బట్టనమ్మి కత్తికొనుక్కొనవలెను;
37 - ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాటనాయందు నెరవేరవలసియున్నది; ఏలయనగా నన్నుగూర్చిన సంగతి సమాప్తమవుచున్నదని మీతో చెప్పుచున్నాననెను.
38 వారు - ప్రభువా, ఇదిగో ఇక్కడ రెండు కత్తులున్నవనగా - చాలునని ఆయన వారితో చెప్పెను.
39 తరువాత ఆయన బయలుదేరి తన వాడుకచొప్పున ఒలీవలకొండకు వెళ్లగా శిష్యులును ఆయనవెంట వెళ్లిరి.
40 ఆ చోటు చేరి ఆయన వారితో - మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థనచేయుడని చెప్పి
41 వారి యొద్దనుండి రాతివేత దూరము వెళ్లి మోకాళ్లూని
42 తండ్రీ, యీ గిన్నె నాయొద్దనుండి (తొలగించుటకు) నీ చిత్తమైతే తొలగించుము; అయినను నా యిష్టము కాదు నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించెను.
43 అప్పుడు పరలోకమునుండి యొకదూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను.
44 ఆయన వేదనపడి మరింత అతురముగా ప్రార్థనచేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను.
45 ఆయన ప్రార్థన చాలించుకొని లేచి తన శిష్యులయొద్దకు వచ్చి, వారు దుఃఖముచేత నిద్రించుటచూచి
46 - మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థనచేయుడని వారితో చెప్పెను.
47 ఆయన ఇంక మాటలాడుచుండగా, ఇదిగో జనులు గుంపుగా వచ్చిరి. పన్నెండుమందిలో యూదా అనబడినవాచు వారికంటె ముందుగా నడిచి, యేసును ముద్దుపెట్టుకొనుటకు ఆయనయొద్దకు రాగా
48 యేసు - యూదా, నీవు ముద్దుపెట్టుకొని మనుష్యుకుమారుని అప్పగించుచున్నావా అని వానితో అనగా
49 ఆయన చుట్టు ఉన్నవారు జరుగబోవుదాని చూచి - ప్రభువా, కత్తితో నరుకుదుమా అని ఆయనను అడిగిరి.
50 అంతలో వారిలో ఒకడు ప్రధానయాజకుని దాసుని కొట్టివాని కుడి చెవి తెగనరికెను.
51 అయితే యేసు - ఈమట్టుకు తాళుడని చెప్పి, వాని చెవి ముట్టి బాగు చేసెను.
52 యేసు తన్ను పట్టుకొనవచ్చిన ప్రధానయాజకులతోను దేవాలయపు అధిపతులతోను పెద్దలతోను - మీరు బందిపోటు దొంగమీదికి వచ్చినట్టు కత్తులతోను గుదియలతోను బయలుదేరి వచ్చితిరి?
53 నేను అనుదినము మీచెంత దేవాలయములో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు; అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనెను.
54 వారాయనను పట్టి యీడ్చుకొనిపోయి ప్రధానయాజకుని యింటిలోకి తీసికొనిపోయిరి. పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండు.
55 అంతట కొందరు నడుముంగిట మంటవేసి చుట్టు కూర్చుండినప్పుడు, పేతురును వారి మధ్యను కూర్చుండెను.
56 అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతడు కూర్చుండుట చూచి అతని తేరిచూచి - వీడును అతనితోకూడ ఉండెనని చెప్పెను.
57 అందుకు పేతురు - అమ్మీ, నేనతని నెరుగననెను.
58 మరి కొంతసేపటికి మరియొకడు అతని చూచి - నీవును వారిలో ఒకడవనగా పేతురు - ఓయీ, నేను కాననెను.
59 ఇంచుమించు ఒక గడియయైన తరువాత మరియొకడు - నిజముగా వీడును అతనితోకూడ ఉండెను, వీడు గలిలైయుడని దృఢముగా చెప్పెను.
60 అందుకు పేతురు - ఓయీ, నీవు చెప్పినది నాకు తెలియదనెను. అతడింక మాటలాడుచుండగా వెంటనే కోడి కూసెను.
61 అప్పుడు ప్రభువు తిరిగి పేతురువైపు చూచెను గనుక పేతురు - నేడు కోడి కూయకమునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసికొని
62 వెలిపలికిపోయి సంతాపపడి యేడ్చెను.
63 యేసును పట్టుకొనిన మనుష్యులు ఆయనను అపహసించి కొట్టి, ఆయన ముఖము కప్పి,
64 - నిన్ను కొట్టినవాడెవడు ప్రవచింపుమని ఆయనను అడిగి
65 ఆయనకు విరోధముగా ఇంక అనేక దూషణ మాటలాడిరి.
66 ఉదయము కాగానే ప్రజల పెద్దలును ప్రధానయాజకులును శాస్త్రులును సభకూడి, ఆయనను తమమహాసభలోకి తీసికొనిపోయి
67 - నీవు క్రీస్తువైతే మాతో చెప్పుమనిరి. అందుకాయన - నేను మీతో చెప్పినయెడల మీరు నమ్మరు.
68 అదియుగాక నేను మిమ్మును అడిగినయెడల మీరు నాకు ఉత్తరము చెప్పరు.
69 ఇది మొదలుకొని మనుష్యకుమారుడు మహాత్మ్యముగల దేవుని కుడిపార్శమున ఆసీనుడగునని వారితో చెప్పెను.
70 అందుకు వారందరు - అట్లయతే నీవు దేవుని కుమారుడవా అని అడుగగా ఆయన - మీరన్నట్టు నేనే ఆయనను అని వారితో చెప్పెను.
71 అందుకు వారు - మనకిక సాక్షులతో పని ఏమి? మనము అతని నోటిమాట వింటిమిగదా అని చెప్పిరి.
Download Audio File

No comments:
Post a Comment