1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరౌగుస్తువలన ఆజ్ఞ ఆయెను.
2 ఇది కురేనియు సురియదేశమునకు అధిపతియై యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య.
3 అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమతమ పట్టణములకు వెళ్లిరి.
4-5. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక, తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతియై యుండిన మరియతో కూడ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలైయలోని నజరేతు పట్టణములోనుండి యూదైయలోని బేత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్లెను.
6 వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక
7 తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను.
8 ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా
9 ప్రభువు దూత వారియొద్దకు వచ్చినిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి.
10 అయితే ఆ దూత - భయపడకుడి; ఇదిగో ప్రజలకందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను;
11 దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టియున్నాడు; ఈయన ప్రభువైన క్రీస్తు
12 దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తోట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి
13-14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుంచుడెను.
15 ఆ దూతలు తమయొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు - జరిగిన యీ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు; మనము బేత్లెహేమువరకు వెళ్లి చూతము రండని యొకనితో నొకడు చెప్పుకొని
16 త్వరగా వెళ్లి, మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి.
17 వారు చూచి యీ శిశువునుగూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురముచేసిరి.
18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులనుగూర్చి విన్నవారందరు మిక్కిలి ఆశ్చర్యపడిరి.
19 అయితే మరియ ఆ మాటలన్నియు తన హృదయములో తలపోసికొనుచు భద్రము చేసికొనెను.
20 అంతట గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటినిగూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రముచేయుచు తిరిగి వెళ్లిరి.
21 ఆ శిశువుకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసుఅను పేరు వారు ఆయనకు పెట్టిరి.
22-24. మోషే ధర్మశాస్త్రముచొప్పున వారు తమ్మును శుద్ధిచేసికొను దినములు గడిచినప్పుడు - ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠచేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టుఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టుగువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును, వారు ఆయనను యోరూషలేముకు తీసికొనిపోయిరి.
25 యోరూషలేమునందు సుమెయోనను ఒక మనుష్యుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునైయుండి, ఇశ్రాయేలుయొక్క ఆదరణకొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతనిమీద ఉండెను.
26 అతడు ప్రభువు యొక్క క్రీస్తుని చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలుపరచబడియుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయములోకి వచ్చెను.
27-28. అంతట ధర్మశాస్త్రపద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తలిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోకి తీసికొనివచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను -
29-32. - నాధా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు;అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగానునీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజలయెదుటసిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని.
33 యోసేపును ఆయన తల్లియు ఆయననుగూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి.
34 సుమెయోను వారిని దీవించి - ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు, ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడియున్నాడు;
35 మరియు నీ హృదయములోకి ఒక ఖడ్గము దూసిపోవునని ఆయన తల్లియైన మరియతో చెప్పెను.
36 మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తి యుండెను. ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారముచేసి బహుకాలము గడచినదై,
37 యెనుబది నాలుగు సంవత్సరములు విధవరాలైయుండి, దేవాలయము విడువక ఉపవాసప్రార్థనలతో రేయింబగళ్లు సేవచేయుయుండెను.
38 ఆమెకూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవునికొనియాడి, యోరూషలేములో విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనుగూర్చి మాటలాడుచుండెను.
39 అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున తీర్చిన పిమ్మట గలిలైయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్లిరి.
40 బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు, ఎదిగి బలముపొందుచుండెను; దేవుని దయ ఆయనమీద నుండెను.
41 పస్కాపండుగప్పుడు ఆయన తలిదండ్రులు ఏటేట యోరూషలేముకు వెళ్లుచుండువారు.
42 ఆయన పన్నెండేండ్లవాడై యున్నప్పుడు ఆ పండుగ ఆచరించుటకై వాడుకచొప్పున వారు యోరూషలేముకు వెళ్లిరి.
43 ఆ దినములు తీరినతరువాత వారు తిరిగి వెళ్లుచుండగా బాలుడైన యేసు యోరూషలేములో నిలిచెను.
44 ఆయన తలిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన పరసలో ఉన్నాడని తలంచి, యొక దినప్రయాణము సాగిపోయి, తమ బంధువులలోను నెళవైనవారిలోను ఆయనను వెదకుచుండిరి.
45 ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యోరూషలేమునకు తిరిగి వచ్చిరి.
46 మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్యను కూర్చుండి వారిమాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచు ఉండగా చూచిరి.
47 ఆయన మాటలు వినినవారందరు ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి.
48 ఆయన తలిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి, ఆయన తల్లి - కుమారుడా, మమ్మును ఎందుకీలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా
49 ఆయన - మీరేల నన్ను వెదుకుచుంటిరి? నేను నా తండ్రి పనులమీద నుండవలెనని మీరెరుగరాఅని వారితో చెప్పెను;
50 అయితే ఆయన తమతో చెప్పినమాట వారు గ్రహింపలేదు.
51 అంతట ఆయన వారితోకూడ బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడియుండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటిని తన హృదయములో భద్రము చేసికొనెను.
52 యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.
Download Audio File

No comments:
Post a Comment