1 తిబెరికైసరు ఏలుబడి పదునైదవ సంపత్సరమందు యూదైయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలైయకు హేరోదు చతుర్ధాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్ధాధిపతిగాను, అబిలేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,
2 అన్నయు కయపయు ప్రధానయాజకుడు గాను ఉన్నకాలమున అరణ్యములో జెకర్యా కుమారుడైన యోహాను
3-6. అంతట అతడు వచ్చి, పాపక్షమాపణనిమిత్తము మారుమనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యొర్దానునదీ ప్రదేశమందంతట ప్రకటించుచుండెను. - ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలను సరాళముచేయుడి ప్రతిపల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడునువంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగునుసకల శరీరులు దేవుని చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్నయొకని శబ్దముఅని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంధమందు వ్రాయబడినట్టుఇది జరిగెను.
7 అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహములను చూచి - సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు?
8 మారుమనస్సుకు తగిన ఫలములు ఫలించుడి - అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొన వద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహాముకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.
9 ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడియున్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో పడవేయబడునని చెప్పెను.
10 అందుకు జనులు - ఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా
11 అతడు - రెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్యవలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలెననియు వారితో చెప్పెను.
12 సుంకరులును బాప్తిస్మముపొంద వచ్చి - బోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా
13 అతడు - మీకు నిర్ణయింపబడిన దానికంటె ఎక్కువ తీసికొనవద్దని వారితో చెప్పెను.
14 రాణువవారును - మేమేమి చేయవలెనని అతని నడిగినందుకు అతడు - ఎవనిని బాధపెట్టకయ ఎవనిమీదను అపనిందవేయకయు మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
15 ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానునుగూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా
16 యోహాను - నేను నీళ్లతో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారునైనను విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోనుఅగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును;
17 ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలు పోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయునని అందరితో చెప్పెను.
18 ఇదియుగాక అతడింక అనేక సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటంచెను.
19 అయితే చతుర్ధాధిపతియైన హేరోదు తన తమ్ముని భార్యయైన హేరోదియ నిమిత్తమును, తాను చేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును యోహాను తన్ను గద్దించినందుకు
20 అదివరకు తాను చేసినవన్నియు చాలనట్టు యోహానును చెరసాలలో వేయించెను.
21 ప్రజలందరును బాప్తిస్మము పొందునప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్ధన చేయుచుండగా ఆకాశము తెరువబడి
22 పరిశుద్ధాత్మ శరీరాకారముగా పావురమువలె ఆయనమీదికి దిగివచ్చెను. అప్పుడు నీవు నా ప్రియకుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
23 యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడై యుండెను. ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను
24 హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,
25 మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,
26 నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,
27 యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీయేలుకు, షయల్తీయేలు నేరికి,
28 నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదముకు, ఎల్మదాము ఏరుకు,
29 ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,
30 లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యాకీముకు,
31 ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీదుకు,
32 దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
33 నయస్సోను అమ్మీనాదాబుకు, అమ్మీనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
34 యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెరహుకు, తెరహు నాహోరుకు,
35 నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
36 షేలహు కేయినానుకు, కేయినాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
37 లెమెకు మెతూషెలకు, మెతూషెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహలలేలుకు, మహలలేలు కేయినానుకు,
38 కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడై యుండెను.
Download Audio File

No comments:
Post a Comment