1 మరి యొకప్పుడు ఆయన తన శిష్యులతో ఇట్లనెను - అభ్యంతరములు రాకపోవుట అసాధ్యముకాని అని ఎవనివలన వచ్చునో వానికి శ్రమ.
2 వాడీ చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగజేయుటకంటె వాని మెడకు తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు.
3 మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పితము చేసినయెడల అతని గద్దించుము; అతడు మారుమనస్సు పొందిన పక్షమున అతని క్షమించుము.
4 అతడు ఒక దినమున ఏడు మారులు నీకు తప్పితము చేసి యేడు మారులు నీ వైపు తిరిగి - మారుమనస్సు పొందితిననినయెడల అతని క్షమింపవలెననెను.
5 అపొస్తలులు -మా విశ్వాసము వృద్ధిపొందించుమని ప్రభువుతో చెప్పగా
6 ప్రభువు - మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళిచెట్టును చూచి - నీవు వేళ్లతోకూడ పెల్లగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును.
7 దున్నువాడు గాని మేపువాడు గాని మీలో ఎవనికైన ఒక దాసుడుండగా వాడు పొలమునుండి వచ్చినప్పుడు - నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయుమని వానితో చెప్పునా? చెప్పడు.
8 అంతేకాక - నేను భోజనము చేయుటకేమైనను సిద్ధపరచి, నడుముకట్టుకొని నేను అన్నపానములు పుచ్చుకొనువరకు నాకు పరచారము చేయుము; అటుతరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని
9 ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపెనని వాని మెచ్చునా?
10 అటువలె మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నియు చేసినతరువాత - మేము నిష్ ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినివాటినే చేసియున్నామని చెప్పుడనెను.
11 ఆయన యెరూషలేముకు ప్రయాణమై పోవుచు సమరైయ గలిలైయల మధ్యగా వెళ్లుచుండెను.
12 ఆయన యొక గ్రామములోకి వెళ్లుచుండగా పదిమంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి
13 - యేసు ప్రభూ, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి.
14 ఆయన వారిని చూచి - మీరు వెళ్లి మిమ్మును యాజకులకు కనుపరచుకొనుడని వారితో చెప్పెను, వారు వెళ్లుచుండగా శుద్ధులైరి.
15 వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి
16 గొప్ప శబ్ధముతో దేవుని మహిమపరచుచు, తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదములయొద్ద సాగిలపడెను; వాడు సమరైయుడు.
17 అందుకు యేసు - పదిమంది శుద్ధులైరి కారా; ఆ తొమ్మండుగురు ఎక్కడ?
18 ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చినవాడెవడును అగుపడలేదా అని చెప్పి
19 - నీవు లేచిపొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని వానితో చెప్పెను.
20 దేవుని రాజ్యమెప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన నడిగినప్పుడు ఆయన - దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు
21 ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే యున్నది గనుక, ఇదిగో ఇక్కడని అదిగో అక్కడనని చెప్ప వీలుపడదని వారికి ఉత్తరమిచ్చెను.
22 మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను - మనుష్యకుమారుని దినములలో ఒకదినము చూడవలెనని మీరు కోరుదినములు వచ్చునుగాని మీరాదినమును చూడరు.
23 వారు - ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినయెడల వెళ్లకుడి, వెంబడింపకుడి.
24 ఆకాశముక్రింద ఒక దిక్కునుండి మెరుపుమెరసి ఆకాశము క్రింద మరియొక దిక్కున కేలాగున ప్రకాశించునో ఆలాగున మనుష్యుకుమారుడు తన దినమున ఉండును.
25 అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది యీ తరమువారిచేత ఉపేక్షింపబడవలెను.
26 నొవహు దినములలో జరిగినట్టు మనుష్యకుమారుని దినములలోను జరుగును.
27 నోవహు ఓడలోకి వెళ్లిన దినమువరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియ్యబడుచు నుండిరి; అంతలో జలప్రళయము వచ్చి వారినందరిని నాశనముచేసెను.
28 లోతు దినములలో జరిగినట్టును జరుగును, జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచునుండిరి.
29 అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశమునుండి అగ్ని గంధకములు కురిసి వారినందరిని నాశనముచేసెను.
30 ఆ ప్రకారమే మనుష్యుకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును.
31 ఆ దినమున ఇంటి మిద్దెమీద ఉండువాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొని పోవుటకు దిగకూడదు; ఆలాగే పొలములో ఉండువాడును తాను విడిచిపెట్టి వచ్చినవాటికోసరము తిరిగి రాకూడదు.
32 లోతు భార్యను జ్ఞాపకము చేసికొనుడి.
33 తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దాని పోగొట్టుకొనును, దాని పోగొట్టుకొనువాడు దాని సజీవముగా కాపాడుకొనును.
34 ఆ రాత్రి యిద్దరొక్క మంచముమీద ఉందురు; వారిలో ఒకడు కొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును.
35 ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగలి విసురుచుందురు;
36 ఒకతె కొనిపోబడును ఒకతె విడిచిపెట్టబడుననెను.
37 శిష్యులు - ప్రభువా, యిది ఎక్కడ (జరుగు)నని ఆయన నడిగినందుకాయన - పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలును పోగవునని వారితో చెప్పెను.
Download Audio File

మిగిలిన తొమ్మిది కుష్ఠురోగుల
ReplyDelete