1 జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సుతీరమున నిలిచి
2 ఆ సరస్సుతీరముననున్న రెండు దోనెలను చూచెను; జాలరులు వాటిలోనుండి దిగి తమ వలలు కడుగుచుండిరి.
3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కి - దరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.
4 ఆయన బోధించుట చాలించిన తరువాత - నీవు దోనెను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా
5 సీమోను - ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమిగాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.
6 వారాలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా
7 వారు వేరొక దోనెలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలెనని వారికి సంజ్ఞలు చేసిరి; వారు వచ్చి రెండు దోనెలు మునుగునట్లు నింపిరి.
8 సీమోను పేతురు అది చూచి, యేసు మోకాళ్లయెదుట సాగిలపడి - ప్రభువా, నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పెను.
9 ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతని తోకూడ నున్నవారందరును విస్మయమొందిరి.
10 ఆలాగున సీమోనుతోకూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయమొందిరి. ) అందుకు యేసు - భయపడకుము, ఇప్పటినుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.
11 వారు దోనెలను దరికి చేర్చినంతట సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
12 ఆయన యొక పట్టణములో నున్నప్పుడు కుష్ఠరోగముతో నిండియున్న యొక మనుష్యుడుండెను. వాడు యేసును చూచి సాగలపడి - ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయనను వేడుకొనెను.
13 అప్పుడాయన చెయ్యిచాపి వాని ముట్టి - నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని అనగానే కుష్ఠరోగము వాని విడిచెను.
14 అప్పుడాయన - నీవు ఎవరితోను చెప్పక వెళ్లి, వారికి సాక్ష్యార్ధమై నీ దేహమును యాజకునికి కనుపరుచుకొని, నీవు శుద్ధుడవైనందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించుమని ఆజ్ఞాపించెను.
15 అయితే ఆయననుగూర్చిన సమాచారము మరి ఎక్కవగా వ్యాపించెను. బహుజనసమూహములు ఆయనమాట వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును కూడివచ్చుచుండెను.
16 ఆయన ప్రార్ధనచేయుటకు అరణ్యములోకి వెళ్లుచుండెను.
17 ఒకనాడాయన బోధించుచుండగా గలిలైయయూదైయ దేశముల ప్రతి గ్రామమునుండియు యోరూషలేమునుండియు వచ్చిన పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును కూర్చుండియుండగా ఆయన స్వస్థపరచునట్లు ప్రభువు శక్తి ఆయనకుండెను.
18 అప్పుడు కొందరు మనుష్యులు పక్షవాయువుగల యొక మనుష్యుని మంచముమీద మోసికొని వాని లోపలికి తెచ్చి ఆయన యెదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని.
19 జనులు గుంపుకూడియుండినందున లోపలికి వాని తెచ్చుటకు వల్లపడకపోయెను గనుక ఇంటిమీదికెక్కి పెంకులు విప్పి మంచముతో కూడ యేసు ఎదుట మధ్యను వాని దించిరి.
20 ఆయన వారి విశ్వాసము చూచి - మనుష్యుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని వానితో చెప్పగా
21 శాస్త్రులును పరిసయ్యులును - దేవదూషణ చేయుచున్న యితడెవడు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడు పాపములు క్షమింపగలడని ఆలోచించుకొనసాగిరి.
22 యేసు వారి ఆలోచన లెరిగి - మీరు మీ హృదయములలో ఏమి ఆలోచించుచున్నారు?
23 - నీ పాపములు క్షమింపబడియున్నవని చెప్పుట సులభమా? - నీవు లేచి నడవుమని చెప్పుట సులభమా?
24 అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యుకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెను అని వారితో చెప్పి, పక్షవాయువు గలవాని చూచి - నీవు లేచి నీ మంచమెత్తికొని నీ యింటికి వెళ్లుమని నీతో చెప్పుచున్నాననెను.
25 వెంటనే వాడు వారియెదుట లేచి తాను పండుకొనియున్న మంచము ఎత్తికొని, దేవుని మహిమపరచుచు తన యింటికి వెళ్లెను.
26 అందరును విస్మయమొంది - నేడు గొప్ప వింతలు చూచితిమని దేవుని మహిమపరచుచు భయమతో నిండుకొనిరి.
27 అటుపిమ్మట ఆయన బయలుదేరి, లేవియను ఒక సుంకరి సుంకపు మెట్టునొద్ద కూర్చిండియుండుటచూచి - నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా
28 అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను.
29 ఆ లేవి తన యింట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులును ఇతరులు అనేకులును వారితోకూడ భోజనమునకు కూర్చుండిరి.
30 పరిసయ్యులును వారి శాస్త్రులును ఇది చూచి - సుంకరులతోను పాపులతోను మీరేల తిని త్రాగుచున్నారని ఆయన శిష్యులమీద సణిగిరి.
31 అందుకు యేసు - రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడక్కరలేదు.
32 మారుమనస్సు పొందటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
33 వారాయనను చూచి - యోహాను శిష్యులు తరచుగా ఉపవాసప్రార్థనలు చేయుదురు గాని, నీ శిష్యులు తిని త్రాగుచున్నారే అని చెప్పిరి.
34 అందుకు యేసు - పెండ్లికుమారుడు తమతో ఉన్నంతకాలము పెండ్లి ఇంటివారిచేత మీరు ఉపవాసము చేయింపగలరా?
35 పెండ్లి కుమారుడు వారియొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినములలో వారు ఉపవాసము చేతురని వారితో చెప్పెను.
36 ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా - ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసికవేయడు; వేసినయెడల క్రొత్తది దాని చింపివేయును; అదియుగాక క్రొత్తదానిలోనుండి తీసిన ముక్క పాతదానితో కలియదు.
37 ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు; పోసినయెడల క్రొత్త ద్రాక్షరసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులును పాడగును.
38 అయితే క్రొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో పోయవలెను.
39 పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే క్రొత్తదాని కోరువాడెవడును లేడు; పాతదే మంచిదనునని చెప్పెను.
Download Audio File

No comments:
Post a Comment